ఓం శ్రీ సాయిరాం 🙏 🙏
సాయిసచ్చరిత్ర 5వ అధ్యాయంలో ప్రస్తావించబడిన వీరభద్రస్వామి మందిరం..రహతా..
జవ్హర్ అలీ శిష్యులతో ఇక్కడే నివసిస్తున్న సమయంలో 'ఈద్ గా' విషయంలో వివాదం జరిగి, ఘర్షణలకు దారి తీయడంతో.. షిర్డీ చేరి బాబాతో మసీదులో ఉంటూ...బాబాకి తానే గురువునని చెప్పుకుని బాబాతో సేవలు చేయించుకుంటూ..బాబాని కూడా రహతా తీసుకొని పోయి అక్కడే ఉండిపోయారు. షిర్డీ ప్రజలకు బాబా రహతాలో ఉండటం ఇష్టం లేక షిరిడి తీసుకొని వెళదామని వస్తే బాబా వారితో.. జవ్హర్ అలీ ముక్కోపి నన్ను విడిచిపెట్టడు కాబట్టి మీరు షిర్డీ వెళ్ళిపోండి అని చెబుతారు. అదేసమయంలో జవ్హర్ అలీ వచ్చి బాబాని తీసుకుని వెళ్ళాలని ప్రయత్నిస్తున్న షిరిడి ప్రజలపై కోపగించుకుంటాడు.
ప్రజలు జవ్హర్ అలీని ఒప్పించిగా.. బాబా, జవ్హర్ అలీ షిర్డీ చేరి అక్కడే ఉండసాగారు..
కొద్ది రోజుల తర్వాత దేవీదాసు ఆధ్యాత్మిక చర్చలో జవ్హర్ అలీని ఓడించి అతని కపటత్వాన్ని ప్రజలకు తెలిసేలా చేశారు..
ఓం శ్రీ సాయిరాం..🙏🙏...

No comments:
Post a Comment