ఓం శ్రీ సాయిరాం 🙏🙏
శ్రీ భవానీ వెంకటగిరి నరసింహ అయ్యర్(B..V.నరసింహ స్వామీజీ..)..
1874 ఆగస్టు 21న తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని భవానీలో సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు శ్రీ బి. వెంకటగిరి అయ్యర్..శ్రీమతి.అంగచ్చి అమ్మాళ్...భార్య సీతాలక్ష్మి..
మెట్రిక్యులేషన్ సేలంలో పూర్తి చేసి.. మద్రాస్ వెళ్లి BA..B.Lలో ఉత్తీర్ణత సాధించి.. 1895లో సేలం తిరిగి వచ్చి.. బార్‌లో చేరి న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.
లాయర్ వృత్తిలో పేదలకు ఉచిత సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. కొద్దిరోజులకే
సేలం మునిసిపాలిటీకి చైర్మన్ అయ్యారు..
1912లో మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయి..1920 వరకు సభ్యునిగా కొనసాగారు. శాసన మండలిలో ప్రాంతీయ భాషలో ప్రసంగించిన మొదటి భారతీయ సభ్యుడు.
శ్రీమతి అనీబిసెంట్ ప్రారంభించిన హోమ్ రూల్ లీగ్‌లో క్రియాశీల సభ్యుడిగా పాల్గొన్నారు.
1921లో తోటలో ఆడుకుంటున్న అతని ఇద్దరు పిల్లలు జయరామ్, సావిత్రి ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించారు.
ఈ సంఘటన తర్వాత, న్యాయవాద వృత్తి, రాజకీయ,సామాజిక కార్యకలాపాల నుండి వైదొలగి..
1925లో ఇల్లు వదిలి ఆధ్యాత్మిక సాధన కోసం సద్గురువును వెతుక్కుంటూ వెళ్లారు.
తిరువణ్ణామలై వెళ్లి అక్కడ ఒక గుహలో 3 సం:లు మౌనం పాటించి వేదాంత అధ్యయనంపై దృష్టి సారించారు..
రమణ మహర్షి జీవిత చరిత్రను "సెల్ఫ్ రియలైజేషన్" పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు..
ఈ పుస్తకం ద్వారా, రమణ మహర్షి దేశవ్యాప్తంగా..యూరప్, అమెరికాలో చాలామందికి పరిచయం అయ్యారు..
ఆ తర్వాత పండరీపురం వెళ్లి విఠల్‌ను పూజించి, ఖేడ్‌గావ్ సద్గురు నారాయణ్ మహారాజ్‌ని చూసి..మెహర్ బాబాతో కలిసి కొంత కాలం ఉన్నారు.
1933లో ఉపాసనీ బాబాను కలవడానికి సాకోరీ వెళ్లి కొన్ని రోజులు అక్కడే ఉన్నారు...సాయిబాబా ఆధ్యాత్మిక సాధనలో శ్రీ ఉపాసనీ బాబాకు సహాయం చేశారని తెలుసుకుని ఉపాసనీ బాబా చేసిన కృషికి నివాళులు అర్పిస్తూ.. ఉపాసనీ బాబాపై “సేజ్ ఆఫ్ సాకోరి” అనే పుస్తకాన్ని రాశారు.
1936లో సాయిబాబా సమాధిని దర్శించుకున్నారు..
అప్పటికే సజీవంగా ఉన్న సాయిభక్తులు..
శ్యామా, తాత్యా, అబ్దుల్ బాబా, లక్ష్మీబాయి షిండే, సగుణ మేరు నాయక్, బాలాసాహెబ్ భాటే, బి.వి.దేవ్, మార్తాండ్ మహరాజ్, రామచంద్ర పాటిల్, కాకా మహాజని, లక్ష్మణ్ మామ జోషి & భాగోజీ షిండే..రఘునాథ్ షిండే..MB రేగే, జస్టిస్ అవస్థే, దాసగణు మహరాజ్, ఉపాసనీ బాబా, హెచ్.వి. సాఠే, ప్రొఫెసర్ జి.జినార్కే, ఆర్.బి పురందరే, దామోదర్ సావల్రామ్ రాసానే, దత్తాత్రేయ దామోదర్ రాసానే, సాయి శరణానంద, నారాయణ మహారాజ్..ఇలా 60 మందికి పైగా భక్తులను కలుసుకుని, ఇంటర్వ్యూ చేసి, ఎంక్వైరీ చేసి, సమాచారాన్ని సేకరించారు.
1936 వరకు, షిర్డీని సందర్శించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది..M.B.రేగే..జస్టిస్ అవస్థేతో కలిసి మహారాష్ట్రలోని అనేక ప్రదేశాల్లో ఇంగ్లీష్ ,మరాఠీ భాషల్లో సభలలో బాబా గురించి ప్రసంగించేవారు..
సాయిబాబాపై 1938-39 వరకు మద్రాసులోని 'సండే టైమ్స్'లో వరుస వ్యాసాలు రాశారు. దాదాపు 30,40 సంచికలలో 20,000 వ్యాసాల వరకు ప్రచురించబడ్డాయి.
వీరి ప్రయత్నాల ఫలితంగా, 1936 నుండి పెద్ద ఎత్తున ప్రజలు షిర్డీని సందర్శించడం ప్రారంభించారు.
బాబా మహా సమాధి అనంతరం షిర్డీకి సందర్శకులు లేకపోవడంతో మసీదుకు ఎదురుగా సగుణ్ మేరు నాయక్ నడుపుతున్న హోటల్ తాత్కాలికంగా మూసివేసారు. స్వామీజీ ప్రచార ప్రయత్నాల తర్వాత బిజీ ఏరియాగా మారిపోయింది.
బాబా గురించి విస్తృతంగా వ్యాప్తి చేసే ఉద్దేశంతో 1940లో మద్రాసు మైలాపూర్ లో అఖిల భారతీయ సాయి సమాజాన్ని ప్రారంభించారు.
1940-41లో ఇంగ్లీష్ ,తమిళంలో "శ్రీ సాయి బాబా భక్తుల అనుభవాలు" (3 వాల్యూమ్స్)పేరుతో పుస్తకాలను ప్రచురించారు.
1939లో ఇంట్రడక్షన్ టు సాయిబాబా ఆయన రాసిన మొదటి పుస్తకం.. హూ ఈజ్ సాయిబాబా..వండర్స్ సెయింట్..చార్టర్స్ అండ్ సెయింగ్స్..గోస్పెల్ ఆఫ్ శ్రీ సాయి బాబా..సంస్కృతంలో 'శ్రీ సాయినాథ్ స్మరణం' పేరుతో శ్లోకాలను కంపోజ్ చేశారు, ఇది తమిళం మరియు .ఇంగ్లీష్‌లోకి అనువదించబడింది.
1944లో స్వామీజీ తమిళంలో ‘శ్రీ సాయి చరిత నాటకం’ అనే నాటకాన్ని, 1945లో 'గ్లింప్స్ ఆఫ్ సాయిబాబా' రాసి ప్రచురించారు.
ప్రస్తుతం మనమందరం పూజించే అష్టోత్తరంతో పాటు శ్రీ సాయినాథ పూజా విధి.. సాయి సహస్రనామం వ్రాసారు. ఇవి సంస్కృతం, తమిళం, తెలుగు,కన్నడ భాషలలో ప్రచురించబడింది.
1940లో స్వామీజీ ఆంగ్లం, తమిళం, సంస్కృతం, తెలుగు విభాగాలతో 'సాయి సుధ' మాసపత్రికను ప్రారంభించారు.
1946, మేలో మద్రాసులోని మైలాపూర్‌లో మొదటి అఖిల భారత సాయి భక్తుల మహాసభ 4 రోజులపాటు జరిగింది. దీనికి శ్రీ కేశవయ్యజీ, మార్తాండ్ మహల్సాపతితో పాటు 200మందికి పైగా ప్రతినిధులు, భక్తులు హాజరయ్యారు.
1954లో M.B రేగే గారి చేతుల మీదుగా లైబ్రరీ, సాయి విద్యాలయంతో పాటు పేదలు, మురికివాడల వాసుల కోసం సాయి ఉచిత డిస్పెన్సరీని ప్రారంభించారు.
1952 జూలై 7న గురుపూర్ణిమ నుండి బాబాను ఆరాధించడం ప్రారంభించారు. గోపురంతో మందిరాన్ని నిర్మించారు. 1953లో మందిరం పూర్తయింది.
1956 అక్టోబర్ 19వ తేదీన స్వామీజీ 83వ జన్మదినాన్ని చెన్నై హెడ్ క్వార్టర్స్‌లో జరుపుకున్నాక..1956 అక్టోబరు 19న బాబాలో ఐక్యమయ్యారు.
1966 జనవరి 26వ తేదీన షిర్డీలోని సమాధి మందిరంలో జస్టిస్ M.B రేగే స్వామీజీ చిత్రపటాన్ని ఆవిష్కరించారు.
ఆ తర్వాత సాయి పాదానంద రాధాకృష్ణ స్వామీజీ అఖిల భారత సాయిసమాజ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు..
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:
Post a Comment