Saturday, June 8, 2024

ఏప్రిల్ 16..శ్రీ ప్రహ్లాద్ మూలేశాస్త్రి (శ్రీ సాయి సచ్చరిత్ర.. అధ్యాయం:12..) సాయిలో ఐక్యమైన రోజు..

 ఓం శ్రీ సాయిరాం 



        ఏప్రిల్ 16..శ్రీ ప్రహ్లాద్ మూలేశాస్త్రి  (శ్రీ సాయి సచ్చరిత్ర.. అధ్యాయం:12..) సాయిలో ఐక్యమైన రోజు..


     ప్రహ్లాద్ మూలే శాస్త్రి సుమారు 1879 సంవత్సరంలో జన్మించారు. మూలేశాస్త్రి భార్య వేణుబాయి.. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.


     హస్తసాముద్రికం, జ్యోతిషశాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న పండితుడు. నాసిక్ నుండి వచ్చాడు..అతనికి పూర్వీకులు (7 తరాల ముందు..)నుండి వాజాపూర్ సమీపంలో ఎన్నో ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది..


       ఇతను బూటీని కలవడానికి షిరిడీకి వచ్చి.. ద్వారకామాయిలో బాబాని దర్శించుకోవడానికి వచ్చాడు..బాబా అతని జీవితాన్ని మార్చే ఒక  అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చారు.


     హస్త సాముద్రికం తెలిసిన వాడవడం వలన.. బాబాకి జ్యోతిష్యం చెప్పాలని చేయి చాపమని అడిగాడు. బాబా చిరునవ్వు నవ్వి 4 అరటి పండ్లు అతని చేతిలో పెట్టారు..


        మధ్యాహ్న హారతి సమయంలో భక్తులతో కాషాయ వస్త్రాన్ని ధరిస్తానని చెప్పి.. మధ్యాహ్న హారతి ప్రారంభమయ్యాక బూటీతో  నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుండి దక్షిణ తెమ్మన్నారు. బూటీ బాబా ఆజ్ఞ ప్రకారం మూలేశాస్త్రి దగ్గరకు వెళ్లి దక్షిణ అడుగగా.. బాబా నా గురువు కాదే? వారికి నేనెందుకు దక్షిణ ఇవ్వాలి? అనుకుంటూ... అంతటి సద్గురువు తన నుండి దక్షిణ కోరుతూ బూటీ వంటి సంపన్నుడుని పంపారు అన్న గౌరవంతో మసీదులోకి వస్తాడు..


       మడితో ఉన్న తాను మసీదులో అడుగుపెడితే మైల పడిపోతానని.. మసీదు బయట నుండి బాబాపై పువ్వులు విసిరాడు.. హఠాత్తుగా బాబా కూర్చున్న స్థానంలో తన గురువు ఘోలప్ స్వామి కనిపించారు..


     ఆశ్చర్యపోయి ఇది కలా! నిజమా! అని, ఎప్పుడో గతించిన తన గురువు ఇక్కడ ఎలా దర్శనమిచ్చారు? అనుకుంటూ.. సందేహాలన్నీ వదిలి మసీదులో అడుగుపెట్టి అందరూ బాబా హారతి పాడుతూ ఉంటే.. తాను మాత్రం గురునామాన్ని స్మరిస్తూ సాయి పాదాలపై పడ్డాడు.. తన గురువు పాదాలకి కళ్ళు మూసుకుని సాష్టాంగ నమస్కారం చేసి.. కళ్ళు తెరిచి చూసేటప్పటికి బాబా చిరునవ్వుతో దక్షిణ అడుగుతూ కనిపించారు..


       అతను బాబా పాదాలలో పద్మాలు వంటి గీతలు చూసి ఆశ్చర్యపోయాడు..సోమనాథ్ దేశ్‌పాండే కూడా (నిమోన్కర్) బాబాపాదాలపై మత్స్యం..ధనుస్సు గుర్తులను స్పష్టంగా చూశానని చెప్పారు..(బి.వి. నరసింహ స్వామీజీ భక్తుల అనుభవాలలో..) 


      జ్యోతిష్యం, హస్త సాముద్రికం ద్వారా అతను ధనం బాగానే సంపాదించాడు.. ఆచారాల విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు. బాబా వీటన్నింటిని మార్చాలని అతను షిరిడీ వెళ్ళే ముందు..కుటుంబ జీవితానికి సంబంధించి తమను తాము ఎలా ప్రవర్తించాలనే దానిపై వ్రాసిన ఒక పుస్తకం ఇచ్చారు...


         ఆసక్తికరమైన విషయం ఏమిటంటే! ఈ పుస్తకం అతని జీవన శైలికి తగ్గట్టుగానే వ్రాయబడింది..ఒక గృహస్థుగా ఎలా ప్రవర్తించాలో నియమాలు..సన్యాసితో సహా జీవితంలోని వివిధ దశల గురించిన నియమాల, నిబంధనలు గురించి వ్రాయబడింది..


         తర్వాత కాలంలో మూలేశాస్త్రి వాజాపూర్‌లో స్థిరపడి ప్రశాంతమైన జీవితాన్ని గడిపి... ఏప్రిల్ 16. 1941న సమాధి చెందారు... అతని వారసులు ఇప్పటికీ జ్యోతిష్యశాస్త్రంలో మూలేశాస్త్రి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు...


      ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:

Post a Comment