ఓం శ్రీ సాయిరాం
బాబా..చాంద్ భాయ్ పాటిల్ కి దర్శనమిచ్చిన ప్రదేశం.. (సాయి సచ్చరిత్ర.. అధ్యాయం - 5)
చాంద్‌భాయ్ ధూప్‌ఖేడ్ గ్రామానికి చెందిన గ్రామాధికారి.
ఈ గ్రామం ఔరంగాబాద్ జిల్లాలోని పైథాన్ తాలూకాలో.. ఔరంగాబాద్ నుండి అజంతా వెళ్లే రహదారిలో 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
చాంద్ పాటిల్, ఒకసారి ఔరంగాబాద్‌కు వెళుతుండగా అతని గుర్రం (బిజిలీ) తప్పిపోయింది...
రెండు నెలలు గడుస్తున్నా ఆ గుర్రం జాడ తెలియకపోవటంతో నిరాశగా తిరుగు ప్రయాణం ప్రారంభించాడు.
ఔరంగాబాద్ నుండి నాలుగున్నర కిలోమీటర్ల (సుమారు 9 మైళ్ళు) దూరం వెళ్ళిన తర్వాత ఒక మామిడి చెట్టు క్రింద కూర్చున్న ఒక ఫకీర్ ను చూసాడు...
ఆ ఫకీర్ కఫ్నీ ధరించి భుజానికి సట్కా తగిలించుకుని - చిలుమ్ తాగడానికి సన్నాహాలు చేస్తున్నాడు...
చాంద్‌భాయ్ తాను పోగొట్టుకున్న గుర్రం గురించి చెప్పాడు.
ఫకీర్ సమీపంలోని నదీ ప్రవాహం వైపు చూపిస్తూ, “వెళ్లు!
మీరు వెతుకుతున్న గుర్రం అక్కడ ఉంది" అని చెప్పాడు.
చాంద్‌భాయ్ ఆ ప్రదేశానికి వెళ్లి వెతకగా రెండు నెలల నుండి కనిపించకుండా పోయిన గుర్రం అక్కడ నీరు తాగుతూ కనిపించింది..
ఆ ఫకీర్ సటకాని నేలపై గుచ్చి నీరు, నిప్పు సృష్టించి.. దానితో చిలుం వెలిగించి చాంద్ భాయ్ కి ఇచ్చారు... అది చూసిన చాంద్ భాయ్ ఇతను సామాన్యమైన ఫకీర్ కాదని గుర్తించి తన ఇంటికి ఆహ్వానించారు..
చాంద్‌భాయ్ పట్టుబట్టడంతో ఫకీర్ అతని ఇంటికి వెళ్లాడు. అక్కడ కొంతకాలం ఉండి..చాంద్‌భాయ్ బంధువు వివాహ ఊరేగింపుతో పాటు మరోసారి శిరిడీకి వచ్చారు...
చాంద్ భాయ్ భార్య మేనల్లుడి వివాహం షిర్డీకి చెందిన ‘వాజిర్బీ’ అనే అమ్మాయితో జరిపించడానికి..
చాంద్‌భాయ్ కుటుంబం, స్నేహితులు గుర్రాలపై, బండ్లపై షిరిడి వచ్చారు...
ఈ విధంగా సాయిబాబా వివాహ బృందంతో రెండవసారి షిర్డీకి వచ్చారు.. షిర్డీలో ఖండోబా మందిరం ముందు ఎద్దుల బండి నుండి దిగుతున్న ఫకీర్‌ని చూసి ఆలయ పూజారి మహల్సాపతి “ఆవో సాయి (స్వాగతం సాయి)!” అని పలికాడు.
చాంద్‌భాయ్ పాటిల్ పాత ఇంటిని కూల్చివేసి కొత్త ఇంటిని నిర్మించారు. అందులో అతని మనవడు శ్రీ. బాబులాల్ నాదన్ పఠాన్ (4వ తరం) నివసించారు.
శ్రీ. బాబులాల్ నాదన్ పఠాన్ చెప్పిన దాని ప్రకారం సాయిబాబా చాంద్ భాయ్ ఇంట్లో సుమారు 2 నెలల పాటు ఉన్నారు. శ్రీ. బాబులాల్ నందన్ పఠాన్ 10 అక్టోబర్ 2023న మరణించారు.
ప్రస్తుతం చాంద్‌భాయ్ పాటిల్ పూర్వీకులు వారి ఇల్లు, సమాధిని చూసుకుంటున్నారు...
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:
Post a Comment