ఓం శ్రీ సాయిరాం
బాబా అనుమతితో తీసిన సాయి ఒరిజినల్ ఫోటో..
సీతారామ్ & కంపెనీకి చెందిన వాసుదేవ్ సదాశివ్ జోషి ..అతని స్నేహితుడు చిదంబరరావు కె. గాద్రే సాయి భక్తులు..
వారు అప్పుడప్పుడు షిరిడీకి వెళ్ళేవారు. ఒకసారి జోషి తన స్నేహితుడికి రూ.10/- ఇచ్చి దానిని బాబాకు దక్షిణగా సమర్పించమని చెప్పాడు...
అతను మరొక కోరిక కూడా కోరాడు... అది బాబాని ఫోటో తీసి దానిని తీసుకునిరావాలని.
గాద్రే రూ.10/-లు తీసుకుని ద్వారకామాయికి వెళ్లి బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి జోషి ఇచ్చిన దక్షిణ ఇచ్చాడు.
ఫోటో తీసుకోవడానికి బాబా అనుమతి కోరే ధైర్యం లేక మౌనంగా ద్వారకామాయిలో ఒక ప్రక్కన నిల్చున్నాడు...
బాబా కూడా చాలా సేపు మౌనంగా ఉన్నారు. గాద్రే ఫోటో కోసం అనుమతి అడుగుతాడేమోనని..
కొద్దిసేపటి తర్వాత బయలుదేరడానికి అనుమతి కోసం బాబా వద్దకు రాగా..బాబాయే స్వయంగా గాద్రేను తన ఫోటో తీయమని అడిగారు.
గాద్రే ఎంతో ఆనందంతో వెంటనే ఈ ఫోటో తీసాడు..
అయితే బాబా ఒక షరతు పెట్టారు. ఈ ఫోటోలు లాభానికి అమ్మకూడదని... అలాగే అని బాబా ఇచ్చిన ఊదీ, ప్రసాదంతో పాటు.. ఫోటో రూపంలో బాబాని కూడా తీసుకుని ఆనందంతో వెనుతిరిగాడు గాద్రే...
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:
Post a Comment