ఓం శ్రీ సాయిరాం
సాయి భక్తుడు దేవ్ బాబా (హేమాడ్ పంత్ మనవడు..అనంతప్రభు వాల్వాల్కర్..) జననం..
1918 ఏప్రిల్ ,13న సాయి భక్తుడు దేవ్ బాబా జన్మించారు..
దేవ్ బాబా తండ్రి రాజారాం కాకా సింధుదుర్గా జిల్లాలోని వళవల్‌కు చెందినవారు. అందుకే వారిని "వాల్ వల్కర్లు" అని పిలిచేవారు...
రాజారాం కాకా 1916లో, హేమాడ్ పంత్ కుమార్తె కృష్ణబాయిని (సీతాబాయి..) వివాహం చేసుకున్నారు. ఈ జంట బొంబాయిలోని గిర్గామ్‌కి మారారు.. అక్కడ రాజారాం అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో పనిచేశాడు. ఇతనికి విఠలుడంటే అమితమైన భక్తి..
రాజారాం కాకాకి నలుగురు కుమారులు,ఒక కుమార్తె..దేవ్ బాబా మొదటి సంతానం...గిర్గామ్ ముంబైకి మారుమూల శివారు ప్రాంతం కావడంతో రాజారాం కుటుంబం దాదర్‌కు మారారు...అక్కడే సీతాబాయి గర్భం దాల్చింది...
మొదటి గర్భం కావడంతో సీతాబాయి బాంద్రాలోని తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. అమె గర్భధారణ సమయంలో అనారోగ్యంతో ఉన్న కారణంగా..దభోల్కర్ చాలా ఆందోళన చెంది..షిరిడీకి వెళ్ళి బాబాకి విషయం చెప్పాడు...
బాబా అతనికి భరోసా ఇస్తూ... సుఖ ప్రసవం జరుగుతుంది.. ఆమెకు కుమారుడు పుడతాడు అని చెప్తారు..బాబా మాటలతో దభోల్కర్ ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాడు..రాజారాం తనకు 'సంత్ జ్ఞానేశ్వర్ లాంటి' కుమారుడుని ఇవ్వమని విఠల్‌ను వేడుకునేవాడు...
డెలివరీ సమయం వచ్చింది..దభోల్కర్ ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉండగా... దేవ్ బాబా 1918 ఏప్రిల్ 13 చైత్ర శుద్ధ ద్వితీయ, కృత్తిక నక్షత్రం, 1వ పాదంలో జన్మించారు..
దభోల్కర్ తన కూతురిని చూడటానికి లోపలికి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు...తల్లి పిల్లవాడిని ఒక మూలకు విసిరివేసింది..ఆ బిడ్డని దగ్గరకు తీసుకోలేదు..కనీసం తాకనైనా తాకలేదు..పిల్లవాడు మూలన ప్రశాంతంగా పడుకున్నాడు..
కానీ అన్నింటికంటే అతనికి చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే... బిడ్డ తల చుట్టూ ఒక కాంతి వలయం...
అతని శరీరం చుట్టూ కాంతి ప్రకాశం కూడా ఉంది.. అందుకే ఆ తల్లి తన బిడ్డను ముట్టుకోవడానికి భయపడి పాలివ్వడానికి కూడా నిరాకరించింది...
వెంటనే దభోల్కర్ బిడ్డను ఎత్తుకుని షిరిడీకి తీసుకొచ్చి..
నేరుగా ద్వారకామాయికి వెళ్లి బాబా పాదాల దగ్గర బిడ్డని పడుకోబెట్టాడు..తన కూతురి ప్రవర్తన గురించి తనకు ఆందోళనగా ఉందని జరిగినదంతా బాబాకు చెప్పాడు...
బాబా బిడ్డను ఎత్తుకొని తన ఒడిలో పడుకోబెట్టుకుని మెల్లగా తట్టారు...తన బొటనవేలును పిల్లవాడి నోటిలో పెట్టగా.. బిడ్డ బాబా వేలుని చప్పరించిగానే పాలు వచ్చాయి...
ఒకసారి దాసగణు త్రివేణి సంగమం వెళ్లి అక్కడ స్నానం చేయాలి అనుకున్నప్పుడు.. అంత దూరం వెళ్ళనవసరం లేదని బాబా పాదాల బ్రోటన వేలు నుండి గంగా యమనలు ఎలా అయితే వచ్చాయో...బాబా బొటనవేలు నుండి ఆ బిడ్డకి పాలు కూడా అలాగే వచ్చాయి....
1952లో దేవ్‌బాబా కిషోరీబాయిని వివాహం చేసుకున్నాడు..కొద్దిరోజుల తరువాత ఆ దంపతులు వారి పూర్వీకుల నివాసమైన అంబర్‌నాథ్‌కి వెళ్లి అక్కడే ఉండసాగారు...
1967లో మొదటి అంతస్తులో ఒక మందిరము నిర్మించి.. సప్తలోహాలతో తయారుచేసిన సాయిబాబా విగ్రహాన్ని స్థాపించి.. ప్రాణప్రతిష్ఠ చేసి...సాయిబాబాని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండేవారు...
దేవ్ బాబా 1994, మే 25, గురువారం, వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున సమాధి చెందాడు...ప్రస్తుతం దేవ్‌బాబా కుమారుడు డాక్టర్ భానుదాస్ ముంబైలో నివసిస్తూ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు...
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:
Post a Comment