Saturday, June 8, 2024

డా: కేశవ్ భగవాన్ గవాంకర్ (అప్పాసాహెబ్)

 ఓం శ్రీ సాయిరాం 


   

    డా: కేశవ్ భగవాన్ గవాంకర్ (అప్పాసాహెబ్) జన్మదినం..


      డా: కేశవ్ భగవాన్ గవాంకర్ (అప్పాసాహెబ్) వైశాఖ శుక్ల పక్ష పంచమి 28 ఏప్రిల్ 1906లో, శనివారం రోజున...ముంబైకి 40 కి.మీ దూరంలోని ఆర్నాలా గ్రామం వసాయ్‌లో జన్మించారు . అతని పూర్వీకులు కూడా ఆర్నాల నుండి వచ్చారు.  


        చిన్న తనంలో అనారోగ్యం వలన డాక్టర్లు ఎంత ప్రయత్నించినా తగ్గలేదు. యశ్వంతరావు గాల్వంకర్ తన మామగారైన హేమాడ్ పంత్ తో కలిసి షిర్డీకి వెళ్లి..బాబా ఊదీ, పాదతీర్థం, ఫోటోతో ముంబైకి వచ్చి..కేశవ్ ఇంటికి వెళ్లి..మీరు బాబాను ఆశ్రయించి మొక్కుకోండి.. వ్యాధి తగ్గాక వాటిని తీర్చండి అన్నారు.


      వెంటనే అతని మేనమామ విఠల్ కాకా..అత్త తమ్మాబాయి..బాబా ఫోటోకు నమస్కరించి.. పిల్లవాడికి అనారోగ్యం తగ్గితే..మీ దర్శనం చేసుకుని ఒక కొబ్బరికాయ..5 కె.జి.ల పేడా సమర్పించుకుంటామని  మొక్కుకుంటారు..


     క్రమంగా కేశవ్ ఆరోగ్యం బాగుపడుతుంది. 5 సం:ల తరువాత 1918 జనవరి నెలలో కేశవ్ తన చిన్న మేనమామ రామచంద్ర పంత్ ..అత్త తమ్మాబాయితో కలిసి షిరిడీ వెళ్తారు.  కేశవ్ అప్పుడు ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు.


       తనను దర్శించిన కేశవ్ కి బాబా తన కఫ్నీని తీసి  కప్పాడు.. బాబా  మహాప్రసాదమైన కఫ్నీని స్వీకరించడానికి కేశవ్ చాలా చిన్నవాడని శ్యామా భావించి..ఆ కఫ్ని తాను తీసుకొని  “దేవా, ఈ కఫ్నీని కేశవ్ పెద్దయ్యాక ఇస్తాను”..అని చెప్పి డాక్టర్ అయ్యాక ఇచ్చాడు..


     తెల్లటి కాటన్‌తో తయారు చేసిన  బాబా ధరించిన కఫ్నీ (కుర్తా) కుట్టిన ఒక శతాబ్దం తర్వాత లేత పసుపు రంగులోకి మారింది. 1993 వరకు, దీనిని చెక్క పెట్టెలో జాగ్రత్తగా మడతపెట్టి ఉంచారు. తరువాత వారి గృహాన్ని సందర్శించే భక్తులకు సాధారణ 'దర్శనం' కోసం డాక్టర్ కేశవ్ భగవాన్ గవాంకర్ కుమారుడు డాక్టర్ సాయినాథ్ గవాంకర్ దానిని బయటకు తీసుకువచ్చి చెక్కతో చేసిన గాజు అల్మారా లోపల హ్యాంగర్‌పై ఉంచారు. డా.సాయినాథ్ గవాంకర్ అల్మారాని దసరా రోజున కేవలం రెండు గంటల పాటు బాబా కఫ్నీని క్లీన్ చేయడం కోసం ఓపెన్ చేస్తారు.


      బాబా సమాధి అయిన 36 సంవత్సరాల తర్వాత 1954 జనవరి 18వ తేదీ సోమవారం నాడు తమ పూర్వీకుల ఇంటి "ఇందిరా నివాస్" గా మార్పు చేసి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు..


     కేశవ్ భగవాన్  సాయిబాబాపై మరాఠీలో .."షిలాధి".. "షిర్డిచే సాయిబాబా".."సాయిబాబా హచ్ చమత్కర్" అనే మూడు పుస్తకాలను రచించాడు.."సాయి లీల” పత్రికకు చాలా సంవత్సరాలు సంపాదకులుగా ఉన్నారు..


     డా: కేశవ్ భగవంత్ గవాంకర్ 1954లో శ్రీ సాయిబాబా సంస్థాన్ కి చైర్మన్ గా ఉన్నారు. ఈ సమయంలోనే సమాధి మందిరంలో  ప్రస్తుతం మనం దర్శించుకునే బాబా మార్బుల్ విగ్రహాన్ని ప్రతిష్టించారు...


       కాకా మహాజని, డాక్టర్ యశ్వంత్ గల్వంకర్ షిరిడీలో 1931 సంవత్సరం వరకు కోజాగిరి పూర్ణిమ ఉత్సవాలను నిర్వహించారు. 1931లో కోజాగిరి పూర్ణిమను శాశ్వతంగా నిర్వహించే బాధ్యతను డాక్టర్ కేశవ్ భగవన్ గవాంకర్‌కు అప్పగించారు. అప్పటి నుండి ఈ పండుగను శ్రీ సాయిబాబా సంస్థాన్ సహకారంతో గవాంకర్ కుటుంబం నిర్వహిస్తోంది.


       డా: కేశవ్ భగవాన్ గవాంకర్ కుమారుడు డా.సాయినాథ్ గవాంకర్..అతని భార్య శ్రీమతి అస్మితా గవాంకర్‌ ముంబైలో జనరల్ సర్జన్‌గా పనిచేస్తున్నారు..వారికి ఒక కుమారుడు డా.జ్ఞానేష్

 గవాంకర్‌..


ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:

Post a Comment