Saturday, June 8, 2024

సాయి ప్రముఖభక్తులలో బాపూసాహెబ్ జోగ్ (సఖారాం హరి) ఒకరు...


 ఓం శ్రీ సాయిరాం 🙏🙏

సాయి ప్రముఖభక్తులలో బాపూసాహెబ్ జోగ్ (సఖారాం హరి) ఒకరు...

 ఇతడు 1856వ సం:లో పూనెలో జన్మించాడు... 

ప్రభుత్వ పి.డబ్ల్యూ.డిపార్టుమెంటులో సూపర్‌వైజరుగా పనిచేసి 1909లో ఉద్యోగ విరమణ చేశాడు... 

అనంతరం భార్య శ్రీమతి తాయిబాయితో కలిసి శిరిడీ వచ్చి స్థిరపడ్డాడు.. వీరికి సంతానం లేదు...

విష్ణుబువా జోగ్, బాపూసాహెబ్ జోగ్ గారి దగ్గరి బంధువులలో ఒకరు..(సాయిసచ్చరిత్ర43,44)..

బాబాకు నిత్యం ఆరతి, పూజ చేస్తుండే మేఘశ్యాముడు 1912, జనవరి 19న మరణించాడు...

అతని మరణానంతరం బాబా ఆ సేవను జోగ్‌కు అప్పగించారు...

అప్పటినుండి 1918లో బాబా మహాసమాధి చెందేవరకు  భక్తిశ్రద్ధలతో బాధ్యతాయుతంగా చేశాడు...

మశీదులో, చావడిలో రోజుకు మూడుసార్లు చొప్పున ఆరతి ఇచ్చేవాడు... 

బాబా మహాసమాధి చెందిన  2 నెలలకే భార్య మరణించడంతో  ఆ ఒక్క బంధం నుండి కూడా విముక్తుడయ్యాడు జోగ్...

సన్యాసం తీసుకుని కావలసిన ఆహారాన్ని భిక్షమెత్తుకుంటూ...కొన్ని సంవత్సరాలపాటు శిరిడీలో బాబా యొక్క సమాధికి సేవలు చేసుకున్నాడు...

కాకాసాహెబ్ దీక్షిత్ మరణానంతరం ఒంటరితనాన్ని భరించలేక బాపూసాహెబ్ షిరిడి విడిచి సాకోరి వెళ్లి ఉపసానీబాబాకు శిష్యునిగా మారాడు...

బాబాకు చేసిన విధంగానే భక్తితో ఉపాసనీబాబాని సేవించుకునేవాడు. 

1926లో (70 సం:ల వయస్సులో)జ్యేష్ఠమాసం ఏకాదశి రోజున సమాధి చెందాడు...

బాపుసాహెబ్ జోగ్ సమాధి సాకోరిలో ఉపాసనీబాబా  ఆశ్రమం ముందు ఉంది...

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:

Post a Comment