Saturday, June 8, 2024

శ్రీ సాయినాథ్ మందిరం..భివ్‌పురి రోడ్..రాయగఢ్ జిల్లా...చించ్‌వాలి-410 201..

 ఓం శ్రీ సాయిరాం 



శ్రీ సాయినాథ్ మందిరం..భివ్‌పురి రోడ్..రాయగఢ్ జిల్లా...చించ్‌వాలి-410 201..


    1949 ఏప్రిల్ 7వ తేదీన శ్రీరామనవమి నాడు ఉదయం గం.10-00 లకు హేమాడ్ పంత్ మనవడి చేతుల మీదుగా మందిరంలో ధుని వెలిగించబడింది..


      బాబా భౌతిక దేహంలో ఉన్నప్పుడు నిర్మించిన మొట్టమొదటి షిర్డీ సాయిబాబా దేవాలయం..


       1916లో  శ్రీ.కేశవ్ రామచంద్ర ప్రధాన్ గారు ఈ మందిరాన్ని నిర్మించారు..వీరు ఈ గ్రామానికి చెందినవారే..జీవనోపాధి కోసం ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో బిల్ కలెక్టర్‌గా పనిచేసేవారు. 


      ప్రధాన్ బాబాని కలవడానికి ముందు, అతనికి గురువులు, సాధువుల పట్ల చాలా అగౌరవం ఉండేది. అతని స్నేహితుడు కుటుంబంతో సహా షిరిడీకి వెళ్తూ బలవంతంగా వీరిని తీసుకుని వెళ్ళారు..

    

       ప్రధాన్ బాబా ముందు నమస్కరించనని, బాబా “పాద తీర్థం” తీసుకోను అని స్నేహితుడికి షరతు పెట్టి మరీ వారితో షిరిడి వెళ్లారు..


      అతని స్నేహితుడు  ద్వారకామాయిలో బాబాను పూజిస్తూ ఉండగా... బాబా ప్రధాన్ వైపు చూపిస్తూ "బాధ్యతా రహితమైన దుష్టుడిని ఇక్కడికి తీసుకురండి" అని అన్నారు.  


     అతడిని బాబా ముందుకి తీసుకురాగా...గురువులు, సాధువుల పట్ల అతని ప్రవర్తన ధిక్కారం గురించి ప్రధాన్‌కి బాబా

బోధ చేసారు...బాబా మాటలకు ప్రధాన్ ముచ్చటపడ్డాడు...సాధువుల పట్ల ఆయనకున్న అభిప్రాయం మాయమైంది. ఆ క్షణంలోనే అతను సాయిబాబాకు అమితమైన భక్తుడు అయ్యాడు.


        బాబా కృపతో ప్రధాన్ ఆర్థిక స్థితి మెరుగుపడి అతనికి మనశ్శాంతి లభించింది... షిరిడి వెళ్ళినప్పుడల్లా భివ్‌పురికి రావాలని బాబాను అభ్యర్థించేవాడు...


       ఒకసారి అతని కోరిక కాదనలేక బాబా "నేను వస్తాను" అని చెప్పారు..బాబాను భీవ్‌పురికి ఎప్పుడు వస్తారని పదే పదే అడిగేవాడు..


        షిర్డీకి వెళ్ళిన ఒక సమయంలో.. తన చిత్రపటాన్ని ప్రధాన్ కి ఇచ్చి.."దీన్ని తీసుకొని మీ ఇంట్లో ఉంచండి! ఇది నేనే అని నిజంగా నమ్మండి!ఇకపై షిరిడీకి రావద్దు!” అని చెప్పారు..


      బాబా తమాషా చేస్తున్నారని మళ్ళీ షిరిడీ వెళ్ళగా.."నేను మీ ఇంట్లోనే ఉన్నాను. మళ్లీ షిరిడీకి రావద్దు. భివ్‌పురికి తిరిగి వెళ్ళు. ఒక ఆలయాన్ని నిర్మించి, అందులో నా చిత్రాన్ని ఉంచి అన్ని పండుగలు నిర్వహించండి. అది మీ షిరిడీ కాబట్టి మళ్లీ తిరిగి రావద్దు. ఇప్పుడు వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళు” అన్నారు. 


      1916లో ప్రధాన్ తన ఇంటి పక్కనే సాయి మందిరాన్ని నిర్మించాడు... 1939లో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ఆలయాన్ని పునరుద్ధరించే క్రమంలో పనులు ఆగిపోయాయి. ఆలయ పూజారి శ్రీ నారాయణ పురోహిత్ గారు సాయి సచ్చరిత్ర పారాయణం ప్రారంభించారు..


      పారాయణం జరుగుతున్న సమయంలో పురోహిత్ గారికి సాయి స్వప్నంలో లో కనిపించి.. "నా ధుని ఏది? ధుని లేకుండా ఇది షిరిడి ఎలా అవుతుంది?" అని ఒక్కసారి కాదు రెండుసార్లు ప్రశ్నించారు...


       ఆ విషయాన్ని మందిరం నడుపుతున్న గుప్తా గారికి తెలియజేయగా.. ఆయన వెంటనే ఆలయ సభ్యులందరితో చర్చించి.. బాబాగారి ఆదేశానుసారం మందిరంలో ధునిని 1949 ఏప్రిల్ 7వ తేదీన శ్రీరామనవమి నాడు ఉదయం గం.10-00 లకు హేమాడ్ పంత్  మనవడు..శ్రీ అనంత ప్రభు వాల్ వాల్కర్ గారి చేతుల మీదుగా వెలిగించబడింది..


      ప్రస్తుతం ఈ మందిర కార్యక్రమాలన్నీ దామూఅన్నా వారసుల పర్యవేక్షిస్తున్నారు..


ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:

Post a Comment