*" తానొకడైనా తలకొక రూపై "*
*సాయిబాబా ను "గణపతి " నీవే అంటారు కేశవ చిదంబర గాడ్గిల్.*
*"మారుతి" నీవే అంటాడు సాయిబాబాను మారుతి రూపంలో దర్శనం పొందిన నానాసాబ్ డేంగ్లే కుమారుడు సోమనాధ్ శంకర్ దేశపాండే.*
*"మారుతి నేవే, గణపతి నీవే, సర్వదేవతల నవ్యాకృతి నీవే " జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు.*
*విశ్వంభరుడైన ఆ సాయినాథుని ఆ రెండు చరణాలలో దర్శింపచేసారు ఆయన.*
*"నుడులకు అందవు సుతులకు పొంగవు " అంటూనే "పాపాలు కడిగేసే పావన గంగ" గా సాయినాథుని గానం చేసేడు ఆయన.*
*సాయిబాబా - కాదనగలడా ?*
*"నిన్నుగానీ శరణుమని సన్నుతించువేళ, జన్మ ధన్యమవుతుంది బాబా " అంటూనే " దాతవని తలచుకొని, జోతలిడేవేళ, దైవం తల ఊపుతుంది కాదా ? మా దైవం తల ఊపుతుంది కాదా ? అని అంటారు డాక్టర్ సి. నా రె గారు.*
*సాయిబాబా కాదనగలడా ?*
*అంతటితో ఆగక "తొలగించినావు వ్యాధులను ఊదీతో " అని అంటారు ఆయన.*
*బాబా ఎప్పుడో నీవు షిరిడీలో నడయాడినప్పుడు చేసానని కాదు, ఇప్పుడు, ఎల్లప్పుడూ అలా ఉదీతో వ్యాధులను నయం చేయమనీ కోరుతూ అడిగాడు ఆయన.*
*"బాబా చూపే మలయ సమీరం " అనేది సి .నా .రే .భావన కాదు.*
*అది పరమసత్యం.*
*సమస్యలతో, బాధలతో, దరి కానని వారికి సాయి సన్నిధి సేద తీరుస్తుంది. ఊరట కలిగిస్తుంది. ఇది జరిగిన జరగుతున్న అనుభవాలు తెలిపే నిత్య సత్యాలు.*
*అందుకనే ప్రతీ భక్తుడు " నీ పాద సన్నిధి నిలువని నాడు నిలువదు నా ప్రాణం " అని అంటారాయన.*
*ఎందుకంటే " కలుష భావనలు చొరబడనీయని కవచం నీ ధ్యానము "అని ప్రతీ భక్తునికి తెలుసు.*
*మరింతగా " అది భవ జగతికే నావ " ఇక మనం సాయినాథుని శరణమని సన్నుతించు వేళ " అయింది అని గుర్తు చేస్తారు.*
*"ఎంతెంత దయ నీది ఓ సాయి"*
*సాయి దివ్య ప్రేమను మరువ కుందుము గాక !*

No comments:
Post a Comment