Saturday, June 8, 2024

శ్రీ గణేష్ వాసుదేవ్ గుణాజి..(N.V. గుణాజి)


 ఓం శ్రీ సాయిరాం 🙏🙏


శ్రీ గణేష్ వాసుదేవ్ గుణాజి..(N.V. గుణాజి)


      1873 జూలైలో కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.


     పాఠశాల విద్యను బెల్గాంలోని సర్దార్ హైస్కూల్‌లో..ముంబైలోని విల్సన్ కళాశాలలో డిగ్రీ.. ముంబైలోనే గవర్నమెంట్ 'లా' కాలేజీలో ఎల్‌.ఎల్‌.బి చదివారు..


       'లా' చదువు పూర్తవగానే బెల్గాంకు తిరిగి వచ్చి లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు.  అతికొద్ది కాలంలోనే ప్రఖ్యాత లాయర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు..


     బెల్గాం మునిసిపాలిటీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కూడా చేసారు..అనేక పుస్తకాలును ఇంగ్లీష్, మరాఠీ భాషలలోకి అనువాదం చేశారు..


      ఎంతోమంది ప్రముఖుల చరిత్రలు, వివిధ సామాజిక అంశాలపై దాదాపు 28 పుస్తకాలు వ్రాశారు...వీరికి శ్రీ సాయిబాబా.. శ్రీ రమణమహర్షి.. శ్రీ రామకృష్ణ పరమహంస వంటి మహాత్ములు ఆధ్యాత్మిక బోధనలు పట్ల ఎంతో ఆశక్తి ఉండేది..


        గుణాజీగారు భగవద్గీతను అనువదించడమే కాక... శ్రీ రామకృష్ణ పరమహంస చరిత్రతో పాటు.. మరాఠీలో శ్రీ రమణ మహర్షి చరిత్ర.. స్వామి రామతీర్థుని బోధనలపై అనేక పుస్తకాలను వ్రాసారు. అమెరికా వాషింగ్టన్ లోని 'బుకర్ టి' గారి జీవిత చరిత్రని "ఆత్మోద్ధర్" అనే పేరుతో అనువదించారు..


       1940 నుండి సాయిబాబాను దర్శించడానికి ఎక్కువగా షిర్డీ వెళ్ళేవారు...1940లో షిరిడి సంస్థానానికి సంబంధించి ఒక కేసు కోర్టులో నడుస్తుండగా.. సంస్థానం వారు మరాఠీలోని సాయిసచ్చరిత్రని ప్రామాణికంగా కోర్టు వారికి చూపించారు.. జడ్జి గారికి మరాఠీ భాష రాకపోవటంతో.."దీనిని ఇంగ్లీషులోకి అనువదించగలరా?" అని అడిగారు.. సంస్థానం వారు 'తప్పకుండా!' అని  వారు ఆ బాధ్యతని గుణాజీ గారికి అప్పగించారు..


         వారు 1944లో దానిని పూర్తి చేశారు.. సంస్థానం వారు ఆ పుస్తకాన్ని కోర్టుకి అప్పగించగా తీర్పు కూడా సంస్థానానికి అనుకూలంగా వచ్చింది.. ఆ విధంగా మరాఠీలో ఉన్న శ్రీ సాయి సచ్చరిత్ర ఇంగ్లీష్ లోకి 1944లో అనువదించబడింది..


    వీరికి ప్రకృతి వైద్యం మీద కూడా ఎంతో అవగాహన ఉంది.. శాస్త్రీయ సమర్థవంతమైన శ్వాస.... యాంటీ T.B & యాంటీ హార్ట్ ఫెయిల్యూర్" అనే రెండు పుస్తకాలను ప్రచురించారు. 


      వీరు ప్రకృతి వైద్యంతో పాటు, శాస్త్రీయంగా మసాజ్ కూడా చేసి.. ఎంతోమంది రోగులకు వైద్యం చేసేవారు..


జాతిపిత మహాత్మాగాంధీ బెల్గాం వచ్చినప్పుడు.. శాస్త్రీయంగా మసాజ్ టెక్నిక్‌లతో చికిత్స చేసే అదృష్టం ఆయనకు కలిగింది. 


     1944లో హేమాడ్ పంత్ విరచిత శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకాన్ని.. ఇంగ్లీషులోకి అనువదించారు..దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని షిరిడి సాయి సంస్థానానికి విరాళంగా ఇచ్చారు.. అప్పటినుండి ఈ పుస్తకం కొన్ని లక్షల మందికి చేరువైంది..


     శ్రీ ఎన్.వి.గుణాజీ తన 90 వ సంవత్సరానికి కొన్ని నెలల ముందు 1963లో  సాయి సాన్నిధ్యం చెందారు.


 ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:

Post a Comment