ఓం శ్రీ సాయిరాం 🙏🙏
ఏప్రిల్ - 15 వామన్ రావ్ గోండ్కర్ (1964) సాయి సాన్నిధ్యం చెందిన రోజు..
శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం-19లో శ్రీ వామన్ రావ్ గోండ్కర్ ప్రస్తావన ఉంటుంది...
అతను షిరిడీలో పుట్టి పెరిగాడు. సంపన్నమైన కుటుంబం..రైతులు...భూమి యజమానులు. లెండి బాగ్ ప్రక్కన ఉన్న భూములు కూడా వారివే..
మొదట్లో లెండీబాగ్ స్థలం కూడా వీరిదే.. దానిని M.W. ప్రధాన్ గారికి విక్రయించారు.. ప్రధాన్ గారు కొనుగోలు చేసిన తర్వాత దానిని షిరిడి సంస్థానానికి విరాళంగా ఇచ్చేశారు..
బాబా భిక్ష స్వీకరించే ఐదు గృహాలలో వీరిది కూడా ఒకటి. ఈ ఇల్లు సఖారామ్ షెల్కే ఇంటికి ఎదురుగా కుడి వైపున ఉంటుంది.
ఒకసారి బాబా ఒక వ్యక్తి చేత నిచ్చెన తెప్పించి.. గోండ్కర్ ఇంటికి ఎదురుగా నిచ్చెన వేసి పైకప్పు మీదకు ఎక్కి..రాధాకృష్ణ మయి ఇంటి పైకప్పు దాటి వెనుక వైపు దిగుతారు...
ఆ సమయంలో రాధాకృష్ణమాయి అనారోగ్యంతో ఉంటుంది.. పురంధరే ఆమె అనారోగ్యాన్ని నయం చేయమని బాబాను వేడుకుంటాడు..
బాబా నిచ్చెన తెచ్చిన వ్యక్తికి (వెంకూ కాంబ్లేకర్) కూలి రూ.2/- ఇస్తారు. అది చూసిన భక్తులు కేవలం నిచ్చెన తెచ్చినంత మాత్రాన రూ.2-/ లు ఇవ్వాలా? అని సాయిని అడుగుతారు..
ఏ శ్రమకైనా శ్రమకు తగ్గ కూలి చెల్లించాలని బాబా వారికి నచ్చజెప్తారు.. కానీ ఆ ధనాన్ని అందుకున్న కాంబ్లేకర్ ఆర్థికంగా ఎదగటమే కాదు.. పిల్లలు లేని అతనికి బాబా నుండి రూ. 2/-లు అందుకున్న తర్వాత.. ఇద్దరు పిల్లలు కలిగారు.. కూలి రూపంలో అతనికి బిడ్డలు కలగాలని ఆశీర్వదించారు సాయి.. అదే సాయి లీల.. సద్గురువు లీలలు సామాన్యులకి అంతగా అర్థం కావు..
వామన్ గోండ్కర్ వారసులు ఇప్పటికీ షిరిడీలో నివసిస్తూ వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు..
పల్లకి ఊరేగింపు సమయంలో.. ఊరేగింపు గ్రామం గుండా బయలుదేరినప్పుడు ముందుగా వీరి ఇంటి వద్ద ఆగుతుంది..
బాబా పల్లకికి ముందుగా మొదటి పూజ చేసే గౌరవం, అదృష్టం ఈ కుటుంబానికే దక్కింది..
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹
.jpg)
No comments:
Post a Comment