Friday, June 7, 2024

పశ్చిమ గొదావరి జిల్లా తణుకు సమీపానగల చివటం గ్రామం.* *ఆ గ్రామములో అచ్చమ్మ అనే యోగిని వుండేవారు

*జ్ఞానిని జ్ఞానియే గుర్తిస్తాడు.*

*పశ్చిమ గొదావరి జిల్లా తణుకు సమీపానగల చివటం గ్రామం.*
*ఆ గ్రామములో అచ్చమ్మ అనే యోగిని వుండేవారు.*

*షిరిడీలో సాయిబాబాకు వున్నట్లు ఆమెకు ఎందరో భక్తులు వుండేవారు.*

*ఆమెకు భక్తుడైన విస్సయ్య పంతులు తమ్ముడు ఒకాయన ఆమె వద్దకు వచ్చి తాను విజయనగరం పోతానని చెప్పాడు.*
*అమ్మ వద్దని చెప్పి సాయిబాబా చరిత్ర పారాయణ చేయమని చెప్పింది.*

*అతను ఆలాగునే పారాయణ చేశాడు ఆమె అతనితో " నీవు ప్రయాణం చేసివుంటే ప్రాణాపాయం సంభవించేదని " చెప్పింది.*
*ఆలాగునే అతనికి గండం తప్పింది. ఇటువంటి సంఘటనలు అనేకం జరిగినవి.*
*విశేషం ఏమిటంటే ఆమె అతనితో సాయిబాబా సచ్చరిత్ర పారాయణ చేయమనడం.*

*ఒకసారి చివటం సమీపనగల ఉండ్రాజవరం గ్రామమంలో సుధీంద్రబాబు అనే సాయిభక్తుడు చివటం అమ్మను వూరికి వెళ్ళుటకు అనుమతిని కోరగా అమ్మ వద్దని చెప్పినా ప్రయాణంచేసి తన సామానులు పోగొట్టుకున్నాడు.*

*అమ్మ లీలలు చేష్టలు సాయిబాబాను పోలిఉండేవి.*

*ఆమె వద్దకి ఒక భక్తురాలు వచ్చి "అమ్మా ! నీవద్దకు సజ్జనులతో పాటు దుర్జనులు కూడా వస్తారు కదా ! " అని అడుగగా, చివటం అమ్మ "నేను ఒక దుకాణం పెట్టుకొన్నానే, మంచివారు, చెడ్డవారు వస్తుంటారు " అని అన్నది.*
*బాబా వద్దకు కూడా వేశ్యలు  దొంగలు వచ్చేవారు.*
*బాబా అందరినీ సమానంగా చూసేవారు, చేరదీసేవారు.* 

*చివటం అమ్మ భక్తులను సద్గ్రంథ పారాయణ చేయమనేది.*

*సాయిబాబా వలె తన దంతంలో గల ఒక పన్నును పీకి సూరమ్మ అనే భక్తురాలుకు ఇచ్చింది.* 

*చివటం అమ్మ భక్తులతో "మనిషిలో ఇద్దరు దొంగలున్నారు. ఒకటి నిద్ర, రెండవది తిండి. పగలూ రాత్రీ నిద్ర అయితే దేవుడిని ఎప్పుడు చూస్తావు ? " అని అనేది.*

*అమ్మ ఒక భక్తుని ప్రశ్నకు సమాధానమిస్తూ " షిరిడీలో గల సాయిబాబా వద్దకు వెళ్లిన తరువాత మరే యే మంత్రంతో పనిలేదు " అని చెప్పేది.*

*అవధూత స్వరూపంగా కొలవబడ్డ చివటం అమ్మ తన దేహాన్ని జూన్ నెల ఎనిమిదివ తారీకు 1981 సం నాడు వదలి ఆ పరమేశ్వరునిలో ఐక్యం చెందారు.*


    *ఒక సేకరణ - సాయి దర్బారు వారి ప్రచురణ నుండి.*

No comments:

Post a Comment