*శ్రీ షిరిడీసాయి బాబాను అనన్యంగా, అంకిత భావముతో ఆరాధించి, సేవించిన మహిళా భక్తులలో శ్రీమతి లక్ష్మీబాయి షిందే ఒకరు.*
*ఈమె బాబాకు షుమారు 45 సంవత్సరాలు సేవచేసినది. ఈమె పూర్తి పేరు లక్ష్మీబాయి తుకారం షిందే.*
*బాబాకు మరొక భక్తుడైన భాగోజీ షిందే ఈమె భర్తకు మేనమామ.*
*ఈమె బాబాకు రోజూ భొజనం తెచ్చేది.*
*అంతేగాక అచంచల విశ్వాసంతో బాబాను రాత్రీ పగలూ సేవించేది.*
*బాబా ఈమెను ఆప్యాయంగా "లక్శ్మి మా " అని సంబోధించేవారు.*
*మహాల్సాపతి, తాత్యాకోతే పాటిలకు ఇచ్చిన ప్రత్యేక అధికారము వలెనే, ఈమెకు కూడా రాత్రులతో సహా అన్నివేళలా మశీదులోకి (ద్వారకామాయి ) లోకి ప్రవేశించడానికి ఏకైక మహిళ ఈమె మాత్రమే.*
*(ఆ రోజులలో ఒక తెర మశీదు తలుపులా పనిచేసేది.*
*మరియు మశీదు పై భాగాన్ని కప్పి ఉండేది )తెర దించిన పిదప లక్ష్మిబాయికి తప్ప మశీదులోకి మరెవ్వరికీ ప్రవేశముండేది కాదు.*
*ఒకరోజు సాయంత్రం యదావిధిగా బాబా మశీదు గోడకు ఆనుకొని తాత్యాపాటీలతో కబుర్లు మాట్లాడుకొంటుండగా లక్ష్మీబాయి అక్కడకు వచ్చి బాబాకు నమస్కరించింది.*
*బాబా లక్ష్మీబాయితో " లక్శ్మీ బాయి ! నేను చాలా ఆకలితో ఉన్నాను.*
*ఏదైనా ఆహారం తీసుకు రా ! " అని బాబా చెప్పగానే లక్ష్మీబాయి తన ఇంటికి పరుగెత్తి వెళ్ళి, ఆహారముగా రొట్టెలు వగైరా పదార్థములు వేడి వేడిగా తయారుచేసుకొని ఒక ప్లేటులో పెట్టుకుని, మసీదుకు వచ్చి బాబా ముందు పెట్టింది.*
*బాబా ఆ అహారపు ప్లేటును తీసుకుని అక్కడే ఉన్న కుక్క ముందు ఉంచారు. అది చూసి లక్ష్మీబాయి ఆశ్చర్యపోయింది.*
*ఆమె వెంటనే బాబాతో "బాబా ! మీకొరకు తొందరగా రొట్టెలు, కూర తయారు* *చేసుకొచ్చాను అది మీకు సమర్పించాను. కానీ దానిని కుక్కకు పెట్టావు.*
*నువ్వు ఒక ముక్క కూడా రుచి చూడలేదు " అని లక్శ్మి బాయి చెప్పగా "లక్శ్మీ బాయి ! ప్రతిజీవిలో భగవంతుడు ఉంటాడు.*
*మీరు పెట్టిన ఆహారం, ఆకలితో ఉన్న ఏ జీవి నోటిలోకి ప్రవేశిస్తే, అది నా నోటిలోకి పడినదని నిశ్చయించుకొండి !".*
*అందువల్ల ఏదైనా ప్రాణికి ఆహారము ఇస్తే అది బాబాకు ఇచ్చినట్లే అని లక్ష్మీబాయికి సూచించాడు.*
*ఆ రోజునుండి లక్ష్మీబాయి బాబా కొరకు రొట్టెలు తీసుకురావటం ప్రారంభించింది.*
*లక్ష్మీబాయి భోజనం వచ్చేవరకు వేరే పదార్థములు ముట్టుకొనేవారు కాదు.*
*కొన్నాళ్ల తరువాత రొట్టెలు బదులు" ఖీర్ " అని సేమియాతో తయారుచేసే తీపి పాయసం తీసుకొనేవారు.*
*ఆ పాయసం కొంత రుచి చూసిన తరువాత, మిగిలినది రాధాకృష్ణ మాయికి పంపేవారు.*
*సాయిబాబా మహాసమాధికి ముందు మశీదులో ఉన్న ఏడుగురిలో లక్ష్మిబాయి శిందే ఒకరు.*
*బాబా తన దేహత్యాగానికి ముందు లక్ష్మిబాయికి అయిదు మరియు నాలుగు మొత్తం తొమ్మిది బ్రిటిషు కాలంనాటి వెండి నాణాలు ఇచ్చారు.*
*ఆ వెండి నాణాలు బాబాకు ఎలా లభించాయి ? వాటిని ఎలా భద్రపరిచారు అన్నది ఎవ్వరికీ తెలియలేదు.*
*షిరిడీలో సాయి బాబా విగ్రహ, ప్రతిష్ట సమాధి మందిరంలో*
*7 -10 -1954 నాడు జరిగినప్పుడు లక్ష్మీబాయి శిందే ప్రత్యక్షముగా పాల్గొన్నది.*
*శ్రీసాయి బాబా అనుగ్రహాన్ని పొందిన ఈ భక్తురాలు ధన్యజీవి.*
*ఈమె 115 సంవత్సరములు జీవించి, చివరగా 02-6 -1962 (ఆ రోజు ఏకాదశి ) నాడు శరీరాన్ని విడచి తన ఇష్టదైవమైన సాయినాధునిలో ఐక్యంచెంది నేటికి 61 ఏళ్లు ముగిసాయి.*
*ఒక సేకరణ*
No comments:
Post a Comment