Saturday, June 8, 2024

దత్తాత్రేయ అవతారమైన శ్రీ అక్కల్‌కోట్ మహారాజ్ గారి పుణ్య తిథి..

 ఓం శ్రీ సాయిరాం 🙏 🙏 



   దత్తాత్రేయ అవతారమైన శ్రీ అక్కల్‌కోట్ మహారాజ్ గారి పుణ్య తిథి..


    చైత్ర బహుళ త్రయోదశి ( సోమవారం, 6వ తేదీ మే 2024) 1878లో సమాధి చెందిన దత్తాత్రేయ అవతారమైన అక్కల్‌కోట్ మహారాజ్  (హిందూ క్యాలెండర్ ప్రకారం) సమాధి దినం...


     అక్కల్‌కోట్‌లో స్థిరపడక ముందు స్వామి సుదూర ప్రాంతాలను సందర్శించారు..హిమాలయ ప్రాంతంలో తిరుగుతూ చైనాను సందర్శించారు...


      ఆ తర్వాత దక్షిణాదిలోని పూరి, కాశి, హరద్వార్, గిర్నార్, కతియావాడ్, రామేశ్వరం వంటి ప్రాంతాలను సందర్శించారు..


    దోమోజిపంత్, చోఖమేలా వంటి ప్రసిద్ధ సాధువులు నివసించిన మహారాష్ట్ర షోలాపూర్ జిల్లా పండరీపురం సమీపంలోని మంగళవేడ అనే పట్టణంలో  బస చేశారు..


        1856లో చింతోపంత్ తోల్ అనే వ్యక్తి ఆహ్వానం మేరకు అక్కల్‌కోట్‌కు వచ్చి పట్టణ శివార్లలోని ఓ చోట బస చేసి..22 సం:లు అక్కడే ఉన్నారు..


    ఆ ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం వ్యక్తి స్వామికి పొగాకు లేని 'చిలుమ్' సమర్పించి, ధూమపానం చేయమని అడిగాడు. స్వామి సమర్థుడు ఏమీ పట్టనట్లు వెలిగించి ఖాళీగా ఉన్న చిలుమును పొగబెట్టడం మొదలుపెట్టారు... అతను స్వామి దివ్యత్వాన్ని గ్రహించి క్షమాపణలు చెప్పి.. చోళప్ప ఇంట్లో ఉండేలా ఏర్పాట్లు చేశాడు..ఈ చిన్న ఇంట్లోనే స్వామి తన చివరి వరకు నివసించారు...


    స్వామి ఆధ్యాత్మిక గురువుగా పేరు ప్రతిచోటా వ్యాపించి భక్తులు స్వామి ఆశీర్వాదం కోసం వచ్చేవారు...


      హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర శుద్ధ త్రయోదశి, 1878వ సం:రం మంగళవారం సాయంత్రం 4 గంటలకు... స్వామి పద్మాసనంలో కూర్చుని తన చివరి మాటలుగా.. "ఎవరూ ఏడవకూడదు, నేను ఎల్లప్పుడూ అన్ని ప్రదేశాలలో ఉంటాను..భక్తుల ప్రతి పిలుపుకు నేను ప్రతిస్పందిస్తాను" అని చెప్పారు..


    సాయిబాబా కూడా తన మహాసమాధికి ముందు సరిగ్గా ఇదే మాట చెప్పారు...


     స్వామి సమాధి చెందేముందు కేశవ్ నాయక్ అనే ఒక భక్తుడు భావోద్వేగానికి లోనై “మహారాజా, మీరు వెళ్తున్నారు కాబట్టి మాకు ఎవరు రక్షణ ఇస్తారు?” అని అడిగాడు...


          స్వామి తన చెప్పుల జతను అతనికి పూజకు ఇచ్చి... "భవిష్యత్తులో నేను అహ్మద్‌నగర్ జిల్లాలోని షిర్డీలో ఉంటాను" అని చెప్పారు..


      కృష్ణ అలీ బాగ్ కర్ అక్కల్కోట్ వెళ్లి స్వామి పాదుకలను పూజించాలనుకున్నాడు. స్వామి కలలో దర్శనమిచ్చి.. "ఇప్పుడు నేను షిరిడీలో ఉంటున్నాను, అక్కడికి వెళ్లి నన్ను పూజించుకో" అని చెప్పారు..బాగ్ కర్ షిరిడీకి వెళ్లి ఆరు నెలలు ఉండి...సాయి వద్ద సెలవు తీసుకొని మళ్ళీ అక్కల్కోట్ వెళ్లాలనుకున్నప్పుడు... సాయి అతనితో "అక్కల్కోట్ లో ఏముంది...అక్కల్కోట్ మహారాజ్ ఇక్కడే ఉన్నారు" అని చెప్పారు..


     నేటికీ  చాలా మంది భక్తులకు స్వామి సమర్థుని లీలలు...సాయినాథుని లీలలు ఒకేలా ఉన్నట్లు అనిపిస్తుంది.. వారు ఇద్దరు గురువులు కాదు ఒక్కరే... అనే సత్యం భక్తులకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది..


ఓం శ్రీ సాయిరాం 🙏 🙏 🌹

No comments:

Post a Comment