ఓం శ్రీ సాయిరాం
సాయిభక్తుడు బాలాజీ పిలాజీ గురవ్ ఇంటికి ఆనుకుని ఉన్న సాయిబాబా ఒరిజినల్ ఫొటోని పూనేకి చెందిన శ్రీ. కాశీనాథ్ గోడే అనే ఫోటోగ్రాఫర్ తీశారు.
1. బాబా కుడి వైపున నానా సాహెబ్ నిమోన్కర్ (శంకర్ రావు రఘునాథ్ దేశ్‌పాండే)..
2. బాబాకు ఎడమ వైపున గోపాల్‌రావు ముకుందరావు బూటి నిలబడి ఉన్నారు. ఈ ఫోటోలో బూటీ క్రిందకి చూస్తున్నారు. బూటీ బాబా ముఖాన్ని ఎప్పుడూ చూడడానికి ఇష్టపడేవాడుకాదు... ఎందుకంటే గురువు పట్ల తనకున్న గౌరవానికి సూచనగా బాబాకు నమస్కరించి క్రిందికి చూడడానికే ఇష్టపడేవారు.. అంతేకాకుండా బాబా సన్నిధిలో మాట్లాడకుండా ఎప్పుడూ మౌనంగా ఉండేవారు..
3. బాబా తలపై గొడుగు పట్టుకున్నది బాగోజీ షిండే..
4. నానా చోప్ దార్ .. బాబాకు ముందుండి నడిచేవాడు..
5. చిన్నపిల్లవాడు నిమోన్కర్ మనవడు గోపాలరావు నిమోన్కర్..
ఈ చిత్రాన్ని మనం నిశితంగా గమనిస్తే, బాబా శ్రీకృష్ణుడిలా (ఒక పాదంతో) నిలబడటం, బాబా ధరించిన కఫ్నీ నుండి ఒక దారం బయటకు రావడం కూడా మనకు కనిపిస్తుంది...
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:
Post a Comment