ఓం శ్రీ సాయిరాం
ఈ ఫోటోని1912వ సంవత్సరంలో గోపాల్ దినకర్ జోషి అనే భక్తుడు తీశాడు.
ప్రతిరోజూ ఉదయం అల్పాహారం తర్వాత బాబా లెండి బాగ్‌కి వెళ్ళేవారు.
సాఠేవాడాలో బస చేసిన భక్తులు వాడా ముందున్న కోనేరు వద్దకు చేరుకొని బాబా రాక కోసం ఆత్రుతగా వేచి చూసేవారు..సాయి దర్శనం చేసుకోవాలని..
ఆ సమయంలోనే జోషి బాబా ఫోటో తీయాలనుకున్నాడు. బాబా లెండిబాగ్ నుండి తిరిగి వచ్చే సమయానికి అతను తన కెమెరాను సిద్దం ఉంచుకున్నాడు...
బాబా అక్కడికి చేరుకోగానే ఫోటో తీయడానికి బాబాను అనుమతి అడిగాడు..
వెంటనే బాబా “నాకు నా ఫోటో వద్దు..కానీ మీరు తప్పకుండా నాతో వచ్చే భక్తుల ఫోటో తీయండి” అన్నారు.
బాబా లెండి బాగ్ నుండి తిరిగి రాగానే సాఠేవాడా దగ్గర కాసేపు నిల్చున్నారు..జోషి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని బాబా ఫోటో తీశాడు.
శ్యామా అది చూసి జోషి మీ ఫోటో తీశాడని బాబాకు చెప్పగా... బాబా “నా ఫోటో నాకు అవసరం లేదు. ఆ ఫోటోతో నేను ఏమి చేయాలి?" అన్నారు..
జోషి తాను తీసిన బాబా ఫోటోని ప్రింట్ చేసి చూసి ఆశ్చర్యపోయాడు.. అందులో బాబా కనిపించలేదు కానీ పాదాలు మాత్రమే కనిపించాయి.. బాబా రూపం అస్పష్టంగా ఉంది...
ఈ ఫోటోలో గొడుగు..భాగోజీ షిండే..ఇతర భక్తులు స్పష్టంగా కనిపిస్తున్నారు. కానీ బాబా స్థానంలో ప్రకాశించే కాంతి ఉంది. సాయి పాదాలు మాత్రమే కనిపిస్తాయి...
ఓం శ్రీ సాయిరాం🙏🙏🌹

No comments:
Post a Comment