Tuesday, May 14, 2024

దామోదార ఘనశ్యామ్ బాబీరే అంటే తెలియకపోవచ్చు గానీ అణా చించణీకర్ అంటే సాయి భక్తులందఱికీ సుపరిచితమే.* *షిరిడీలో సంతాన లక్శ్మి సాయి రూపంలో కొలువై ఉన్నది

 *దామోదార ఘనశ్యామ్ బాబీరే అంటే తెలియకపోవచ్చు గానీ అణా చించణీకర్ అంటే సాయి భక్తులందఱికీ సుపరిచితమే.*


*షిరిడీలో సంతాన లక్శ్మి సాయి రూపంలో కొలువై ఉన్నది.* 

*ఎందరో సాయి కృపతో సంతానవంతులయ్యారు.*


*ఒకసారి సాయిబాబాతో "దేవా ! నీవు ఎందరెందరో కోరికలను తీరుస్తావు కానీ లక్ష్మీబాయి, ఈ అన్నా చించణీకర్ మిమ్మల్ని సేవిస్తున్నా ఒక బిడ్డను కూడా ప్రసాదించవేమి" అని ప్రశ్నించాడు.*

*అప్పుడు సాయి " ఎవరైనా మనస్ఫూర్తిగా ఏదైనా కోరితే నేను ప్రసాదించక పోవటం ఎప్పుడైనా జరిగిందా ? ఈ దంపతులు నన్నేమీ కోరలేదు.*

*కావాలంటే వారినే అడుగు . వారికి నిజంగా బిడ్డ కావాలా ? ఇస్తాను. కానీ ఇతని వంశం ఒక తరం మాత్రమే కొనసాగుతుంది.*

*కనుక ఇతని పేరును చిరస్మరణీయం చేయాలనుకొంటున్నాను "' అని అన్నారు.*


*సాయి ఆ దంపతుల పేర్లు చిర స్మరణీయం ఎలా చేశాడు ?* 

*ఒక కోర్టు కేసులో చించణీకర్ కేసు గెలచి ఎంతో ధనాన్ని తెచ్చుకోగలిగాడు న్యాయబద్దంగా.*

*బాబాకు ఆ ధనాన్ని ఇవ్వబోయాడు,  బాబా అందుకు అంగీకరించక  తాను ఫకీరుననీ ఆ ధనముతో తనకు పని లేదనీ చెప్పాడు.*

*చివరకు బాబా మరొక భక్తుడైన కాకా సాబ్ దీక్షిత్ ఆ ధనమును చావడి మర్మత్తుల:కొరకు వినియోగింపమని సలహా ఇవ్వగా, ఆ సలహా పాటించి చావడిని మరమ్మత్తులు చేయించాడు.*


*ఒక శిలాఫలకం పై "శ్రీ సాయినాధ్ బాబాంచి లక్శ్మి బాయ్, దామోదర్ బాబీరే చించణీకర్ చావడి శ .క 1859 " అని చెక్కబడి చావడి ప్రవేశద్వారం పై ప్రతిష్టింపబడినది.*

*ఇంకనూ చించణీకర్ తన ఆస్తిని సాయిబాబా సంస్థాన్ కు విల్లు ద్వారా సంక్రమించునట్లు చేసాడు.*

*ఆ ధనమే సాయి మహరాజ్ సమాధిఅనంతరం, నైవేద్యమునకు దీపారాధనాలకు ఉపయోగపడింది.* 


*చించణీకర్ 15 -4 -1920 నాడు సాయిలో ఐక్యమయ్యాడు.*


*ఆ పుణ్యదంపతులు చిర స్మరణీయులు.*

No comments:

Post a Comment