Thursday, May 16, 2024

సాయిబాబా వేదాంతాన్ని, భక్తిని, అధ్యాత్మిక క్రమశిక్షణను, నీతిని, దైనందిన ప్రవర్తన, సర్వప్రాణుల సమభావనను బోధించారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు.

 *సాయిబాబా వేదాంతాన్ని, భక్తిని, అధ్యాత్మిక క్రమశిక్షణను, నీతిని, దైనందిన ప్రవర్తన, సర్వప్రాణుల సమభావనను బోధించారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు.* 


*సాయిబాబా మాటలకు కాలదోషం పట్టదు. కాలదోషము పట్టని కమనీయ సూక్తులు, అంటారు పెద్దలు.*


*సాయిబాబా ఒకసారి " నీవు దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టినచో, వస్త్రముల లేనివారికి వస్త్రములు ఇచ్చినచో, నీ వసారా ఇతరులు కూర్చునుటకు ఇచ్చినచో భగవంతుడు మిక్కిలి ప్రీతిచెందును " అని పలికారు.*


*ఒకసారి మహారాష్ట్రకు చెందిన సత్పురుషుడైన ఏకనాథ మహారాజ్ కాశీకి వెళ్లారు.*

*ఒక కమండములో గంగా జలాన్ని తీసుకుని, రామేశ్వరంలోని శివుణ్ణి అభిషేకిద్దామని తద్వరా సంపూర్ణ కాశీయాత్ర ఫలం సిద్ధిస్తుందని భావించాడు.*


*కాశీనుండి తిరుగుప్రయాణం సాగించాడు. అది మంచి ఎండాకాలం. మార్గ మధ్యములో ఎండలు మండిపోతున్నాయి.*

*ఎక్కడా ఒక పచ్చని చెట్టుగాని, చల్లని నీడగాని  లేని ఒక ఎడారిలాంటి ప్రదేశములొ శిష్యులతో కలసి ఏకనాధుడు ప్రయాణం సాగిస్తున్నాడు.*

*అటువంటి వాతావరణములో ఒక చోట కృశించిపోయిన ఒక గాడిద మూలుగు విన్నాడు. అది దాహముతో విలవిల కొట్టుకొంటున్నది.*

*ఆ గాడిద దయనీయ పరిస్తితి చూశాడు ఏకనాధుడు. ఆ పరిస్థితికి చలించిపోయాడు.*


*వెంటనే తాము రామేశ్వరములో శివునికి అభిషేకం చేయాలని తీసుకు వెళుతున్న ఆ గంగా జలాన్ని ఆ గాడిద నోటిలో పోశాడు.*

*"అదేమీ స్వామీ ! కాశీనుండి ఇంతవరకు గంగా జలము ఎంతో కష్టపడి తెచ్చాము. మనం ఆ నీటిని రామేశ్వరము వెళ్ళి ఆ నీటిని కలపాలి గదా !* 

*ఇప్పుడు రామేశ్వరునికి ఏది అర్పించాలి ?" శిష్యులు అడిగారు.*

*"ఈ గాడిదయే నాకు రామేశ్వరము " అని అన్నాడు ఏకనాధుడు.*


*ఏకనాధుడు రామేశ్వరము చేరకుండానే యాత్రా ఫలం సిద్దించినది.*

No comments:

Post a Comment