Wednesday, May 29, 2024

ఈ శరీరం చాలించిన తరువాత నేను షిరిడీలో సాయిబాబా రూపంలో ఉంటాను " అని అన్నారు అక్కల్కోట మహారాజుగా పేరుపొందిన శ్రీ స్వామీ సమర్థ

*"ఈ శరీరం చాలించిన తరువాత నేను షిరిడీలో సాయిబాబా రూపంలో ఉంటాను " అని అన్నారు అక్కల్కోట మహారాజుగా పేరుపొందిన శ్రీ స్వామీ సమర్థ.*
*తన దేహము చాలించిన తరువాత తన భక్తులు, ఆశ్రీతులు అయిన కొందరిని షిర్డీ సాయిబాబా వద్దకు వెళ్లమని సలహ యిచ్చారు.*

*షెగాం మహారాజుగా ప్రసిద్దులైన గజానన మహరాజ్, గణేశ శ్రీకృష్ణ ఖాపర్డే కుటుంబాన్ని, సాయిబాబాను ఆశ్రయించమని అదేశించారు.*

*అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాధిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, సమర్థ సచ్చిదానంద సద్గురువుగా, సాయిబాబాను కీర్తించటం మామూలు అయినది భక్తులకు.*

*అందరికీ సాయినాధునిలో సుగుణాలు ఆకట్టుకొన్నాయి. అలా ఆకట్టుకోవడం ఎప్పటినుండో జరిగేదీ.*

*ఒకసారి సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాన్ సంభవించింది. గాలి ఎక్కువ అవుతున్నది. నేల అంతా నీటిమయమవుతుంది.*
*షిర్డి గ్రామ వాసులు అందరూ ద్వారకామాయికి వచ్చారు. వారు విపత్తును తొలగించమని బాబాను ప్రార్ధించారు.*

*బాబా గొప్ప ధ్వనితో మశీదు అంచున నిలబడి " ఆగు ! ఆగు ! నీ కోపమును తగ్గించుము. నెమ్మదించుము !" అని తుఫాన్ ని గద్దించారు.*

*కొన్ని నిముషాలలో తుఫాను ఉధృతి తగ్గింది. చంద్రుడు కనిపించాడు. ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు.*

*అలాంటి దైవిక శక్తులతో ప్రజలను కాపాడతారు మహనీయులు.*

No comments:

Post a Comment