Wednesday, May 15, 2024

అబ్దుల్ షిరిడీకి రాగానే* *" నా కాకి వచ్చింది " అని సాయిబాబా పలికాడు అబ్దుల్ తో " నీకు ఇంకేమి పని వద్దు. నా సేవ చేయి చాలు " అని అన్నారు సాయి.* *అబ్దుల్ సాయిబాబా చెప్పిన పనిని తూ.చ. తప్పక పాటించేవాడు

 *మహారాష్ట్ర నాందేడ్ లో అమీరుద్దీన్ అని సూఫీ ఫకీరు ఉండెడివాడు.*


*ఒకరోజు రాత్రి ఆయన నిద్రిస్తుండగా ఒక కల వచ్చింది.*

*ఆ కలలో షిరిడీ సాయిబాబా స్వప్న దర్శనమిచ్చి, రెండు మామిడి పళ్ళను ప్రసాదించి, తన వద్ద శిష్యునిగా వున్న అబ్దుల్ అనే వ్యక్తి తో ఆ పండ్లను షిరిడీలో వున్న తన‌  వద్దకు పంపమని అదేశించారు. అమీరుద్దీన్ అలాగునే అబ్దుల్ ను షిరిడీ కి పంపాడు.*


*అబ్దుల్ షిరిడీకి రాగానే* 

*" నా కాకి వచ్చింది " అని సాయిబాబా పలికాడు అబ్దుల్ తో " నీకు ఇంకేమి పని వద్దు. నా సేవ చేయి చాలు " అని అన్నారు సాయి.* *అబ్దుల్ సాయిబాబా చెప్పిన పనిని తూ.చ. తప్పక పాటించేవాడు.*


*రోజూ మశీదు (ద్వారకామాయి ) ఆవరణను, బాబా నడయాడే వీధులను, ప్రదేశాలను శుభ్రము చేసెడివాడు.*

*అబ్దుల్ లెండి వనములోను, చావడిలోను, మసీదులోను దీపాలు వెలిగించెడివాడు.*


*తాను భిక్షచేసి ఉదర పోషణ చేసుకునేవాడు. అనగా సాయిబాబా వలె భిక్షాటన చేసికొనెడివాడు.*


*ఎల్లవేళలా బాబా వెలిగించిన* 

*" ధునిని "* *పర్యవేక్షించెడివాడు.*  


*కొన్నాళ్లకు అబ్దుల్ కు వివాహమైనది.*

*సాయిబాబా చెంతనే ఉండి సేవ చేస్తూ ప్రతిరోజూ మూడు సార్లు స్నానం చేసేవాడు.*


*అబ్దుల్ సాయిబాబా పలికిన విషయాలను ఒక గ్రంథములో వ్రాసుకొన్నాడు.*

*సాయి యే ఆ పలుకులను వ్రాయించుకొన్నాడని అన్నది నిజం.*

*ఆ గ్రంథము ఇంతవరకు ముద్రణకు నోచుకోలేదు.*


*సాయిబాబా మహాసమాధి అనంతరం, ఒక రోజు అబ్దుల్ తన ఇంటిలో ఖురాను గ్రంథ పారాయణ చేసుకొంటున్నప్పుడు, శిధిలావస్థ లోనున్న ఆ ఇల్లు మట్టి గోడలు హఠాత్తుగా కూలిపోయాయి.*

*నడుమువరకు ఆ మట్టి గోడల శిథిలాల్లో అబ్దుల్ ఇరుక్కుపోయాడు.*

*అయినా సాయిబాబా కృపచే యే విధమైన ప్రమాదము జరుగలేదు.*


*అది బాబా కృప.*

*అబ్దుల్ బాబా సమాధి అనంతరం అబ్దుల్ బాబాగా పిలవబడినాడు.*


*అబ్దుల్ బాబా, సాయి బాబా సమాధి పూర్వము మరియు అనంతరం 65 ఏళ్లు సేవ చేసిన మహనీయుడు.*


*అబ్దుల్ బాబా 1954 సం ఏప్రియల్ నెలలో సమాధి చెంది సాయిబాబా లో ఐక్యమయ్యాడు* 

*ఆయన సమాధి లెండి తోట ప్రాంగణములో కలదు.*


*" స్వల్పంగా తిను, ఒక్క పదార్ధంతో తృప్తిపడు, రుచులకు పోవద్దు  అతిగా నిద్రపోవద్దు " అని అబ్దుల్ తో సాయిబాబా అనెడివారు.*

No comments:

Post a Comment