*సాయిబాబా మందిరము నందు గానీ, వేరొక దైవసన్నిధిలో గానీ, షిరిడీలో నింబవృక్షం చుట్టూ గానీ నిజమైన ప్రదక్షిణలు ఎలా చేయాలి ?*
*మన మనసును సాయినాధుని చుట్టూ తిప్పాలి.*
*అదే నిజమయిన ప్రదక్షిణ.* *అంతేకాని సాయిబాబా విగ్రహం చుట్టూ కానీ, బాబా మందిరం చుట్టూకానీ, హడావిడిగా తిరగడం కాదు.*
*ఆంజనేయ స్వామి లాంటి అనన్య భక్తి, రాధకు కృష్ణుని యందు గల దివ్య ప్రేమ, శివుని యందు భక్త మార్కండేయునికి గల విశ్వాసం, రామ భక్తురాలైన శబరికి గల సహనం, అటువంటి భక్తితో సాయినాధుని నిరంతర చింతన చేసి జన్మ సార్థకం చేసుకోవాలి.*
*సద్గురువు "సిద్ధుడై " ఉండి కూడా సాధకుని వలె ప్రవర్తించాలని శాస్త్రం చెబుతుంది.*
*సాయిబాబా ఆ థర్మాన్ని అక్షరాల పాటించాడు. జవహర్ అలీ వద్ద శిష్యరికం, సంత్ తుకారామ్, సంత్ జ్ఞానేశ్వర్ వంటి మహనీయుల హారతి గీతాలు శేజ హారతిలో ఆలపించినప్పుడు, రెండు చేతులు జోడించి భక్తితో నమస్కరించెడివాడు.*
*ద్వారకామాయిలో నేలమీద గోనె పరచుకొని కూర్చుండెడివారు.*
*పల్లకీ, శ్యామకర్ణ పేరుగల గుర్రం ఉన్నా వాటిని ఎప్పుడూ అధిరోహించలేదు.*
*ఇలా ఎన్నేన్నో .....*
No comments:
Post a Comment