Wednesday, May 15, 2024

ఆదిశంకరులు ఈ భూమిపై జీవించినది కేవలం 32 సంవత్సారాలే

 *ఆదిశంకరులు ఈ భూమిపై జీవించినది కేవలం 32 సంవత్సారాలే.* 

*అయినా ఎన్నొ వేల సంవత్సారాలకు సరిపడా అధ్యాత్మిక సంపదను ప్రపంచానికి అందించి చిరస్మరణీయులయ్యారు.*


*ఒకవైపు బౌద్ధమత వ్యాప్తి , మరొకవైపు శైవులు, వైష్ణవులు తాము గొప్పంటే తాము గొప్పని వాదించుకొనే రోజుల్లో ఆదిశంకరులు ఈ నేలపై అవతరించారు.*


*పుట్టింది కేరళ రాష్ట్రంలోని కాలడి గ్రామంలో. ఆసేతు హిమాచలం మూడుసార్లు పర్యటించి, తన బోధనలతో ప్రజలను చైతన్యవంతులన్నీ చేసారు.*


*భారతదేశములో శైవులు, వైష్ణవులతో పాటు, శాక్తేయులు, గాణాపత్యులు, సూర్యోపాసకులు వుండేవారు.*

*వారు ప్రాంతాలవారీగా చీలిపోయి ఒకరిని ఒకరు దూషించుకొంటూ, కొట్లాడుకొంటూ కాలాన్ని వృధాపరచటం చూసి శంకరులు తీవ్రముగా వ్యధచెందారు.*


*ఆ తరుణంలోనే శంకరాచార్యులు అద్వైతమతాన్ని స్థాపించారు.*

*అహం బ్రహ్మాస్మి , తత్వమసి సిద్ధాంత భావజాలం వ్యాపింపచేసి, తనలో ఉన్న దైవాన్ని ముందు దర్శించి, ఎదుట వారిలోనున్న దైవాన్ని దర్శించి తరించమనే బోధతో పలువురిని ఆకట్టుకున్నారు.*


*పరమ శివుడు, మహావిష్ణువు వేరు కాదు. వివిధ రూపాల్లో కనిపించినా ఇరువురు ఒక్కరే అని చాటిచెప్పి, " శివాయ విష్ణు రూపాయ ,శివ రూపాయ విష్ణవే " అని ప్రబోధించారు.*


*అజ్ఞానాన్ని పారద్రోలి వివేకవంతులను చేశారు.*

*సూర్యుణ్ణి, గణపతిని, అమ్మవారిని, పరమశివుణ్ని, మహా విష్ణువును ఆరాధ్యదేవతలగా, ఇష్టదైవాలుగా నమ్మి పూజించే ఎవ్వరినీ నిరాశపరచకుండా, ఏ దైవాన్ని ద్వేషించకుండా అందరినీ ఒక పీఠంపైనే కూర్చోపెట్టి పూజచేయవచ్చని నచ్చజెప్పి పంచాయతన పూజను ప్రోత్సహించారు.*

No comments:

Post a Comment