Tuesday, May 28, 2024

రాజమ్మ సాయినాథుని అనేక లీలలు కనులారా గాంచినదని తెలియవస్తుంది.

*దక్షిణ భారతదేశం  నుండి సాయిబాబా మహాసమాధికి పూర్వము బాబాను దర్శించిన వారే తక్కువ. అందులో మహిళలు మరీ తక్కువ.* 

*1889 సం. మే నెల 29 వ తారీకున తమిళనాడు రాష్ట్రంలో కొయంబత్తూర్ సమీపాన వెల్లకినారు అనే గ్రామములో రాజమ్మ జన్మించింది.*

*ఈమె పెదనాన్న శ్రీ తంగవేలు గౌండర్ సన్యాసం స్వీకరించి, షిర్డిలోని సాయిబాబాను దర్శించారు.*
*సాయిబాబాను తన గ్రామానికి తీసుకొచ్చారని, రాజమ్మను శ్రీ సాయి దీవించారని చెబుతారు.*

*రాజమ్మకు వివాహమైనది. ఒక కుమారుడు కూడా జన్మించాడు. రాజమ్మకు షిరిడీలోని సాయిబాబాను దర్శించాలని కోరిక కలిగింది. దానికి ఆమె భర్త అసమ్మతి తెలియచేసాడు. కానీ ఒక షరతు పెట్టాడు.*

*ఇటువంటి షరతులు పెట్టిన మరొక భక్తుడు లక్ష్మణ్ కృష్ణాజీ నూల్కరు,  ఒకటి బ్రాహ్మణ వంటమనిషి దొరకవలెనని, చక్కని నాగపూరు కమలాఫలముల లభించాలని.*

*బాబా సంకల్పించుకొనినచో కొదవేమున్నది.* 
*ఆ రెండు షరతులు వెంటనే నెరవేరినవి. నూల్కరు సాయిబాబాను దర్శించాడు.*
*రాజమ్మ భర్త సుబ్రమణ్య గౌండరు "మన ఇంటిలోని ఆవు ఏడు దినములలో అమ్ముడుపోయినచో తప్పక షిరిడీకి వెళదాం " అని అన్నాడు.*

*సాయి కృపవలన ఆ ఆవు నాలుగు రోజులలోనే అమ్ముడుపోయింది. ధర కూడా 55 -00 రూపాయలు పలికింది.*

*ఈ సాయిలీలా అనుభూతి ఫలితంగా 1908 సం. లో 17 సం. వయస్సుగల రాజమ్మ, భర్త సుబ్రమణ్య గౌండరు, పసిబిడ్డతో షిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించారు.*

*"అల్లా అచ్చా కరేగా అని రాజమ్మను దీవించి, సాయి రాజమ్మను "నల్లా ఇరు "( చల్లగా ఉండు ) అని దీవించారు.*
*సాయిబాబా వీరితో తమిళంలోనే సంభాషించేవారు.*

*రాజమ్మ సాయినాథుని అనేక లీలలు కనులారా గాంచినదని తెలియవస్తుంది.*

*సాయిబాబా ఆరడుగుల ఎత్తు, పొడవైన చేతులు (మోకాళ్ళ దాటి ఉండేవి ).*
*కొనదేలిన ముక్కు, కంటిపాపలు నీలముగా మిలమిల మెఱయుచు, తీక్షణమైన చూపుతో సాయి ఉండేవారని ఈమె వర్ణించింది.*

*బాబా తన కృపాధారలు కురిపించి ఈమె నామమును (రాజమ్మ ) శివమ్మ తాయిగా మార్చినారు.*
*ఈమె తదనంతరం పెక్కుమార్లు సాయి దర్శనం చేసి, దక్షిణాదిన అనేక సాయి మందిరములను ప్రతిష్ట చేసినది.*
*అంతేగాక బెంగళూరు నగరంలో స్వయముగా సాయిమందిరం నిర్మించుకున్న ధన్య జీవి.*

*కర్ణాటక, తమిళ రాష్ట్రాలలో ఎందరికో సాయిబాబా గూర్చి తెలిపిన భక్తురాలు* 

     *సాయి దర్బార్ వారి గ్రంథ నుండి సేకరణ*1 za

No comments:

Post a Comment