Wednesday, May 15, 2024

సాయినాథుని ధుని

 *🔥సాయినాథుని ధుని🔥*


*తెలుగువారికి ఇలవేల్పు పురాణ పురుషుడైన శ్రీ వెంకటేశ్వరుడు.*

*ఇటీవల కాలంలో శ్రీ షిరిడీ సాయి బాబా తెలుగువారి ఇలవేల్పు డయ్యాడని అనిపిస్తుంది.*


*సాయిబాబా మహాసమాధి చెందక పూర్వమే ఎందరో తెలుగువారు సాయి బాబాను దర్శించారు, సాయి భక్తులైనారు.*


*ఉదాహరణకు - బెహరా బాబురావు, వాడ్రేవు వీరేశలింగం, మంత్రిప్రగడ లక్ష్మీ నరసింహరావు, నందిపాటి జగన్నాయకులు, సాయి మహాసమాధి అనంతరం, షిరిడీని దర్శించి ధన్యులైన తెలుగు వారెందరో.*

*సాయి కృపకు పాత్రులైనవారెందరో.*


*తెలుగు రాష్ట్రంలో కృష్ణా జిల్లా వెంట్రప్రగడ గ్రామ నివాసులు శ్రీ నాగభైరవ వెంకటరత్నం గారు, ఆయన భార్య శ్రీమతి నాగరత్నమ్మ గారు.*

*నాగరత్నమ్మ గారి శరీరంపై దద్దుర్ల వ్యాధి వచ్చింది. ఆ దంపతులు ఎంతో బాధపడ్డారు.*

*ఎందరెందరో ఇంగిలీషు, ఆయుర్వేద వైద్య శిఖామణులు చికిత్స చేసినా ఫలితం లేదు.*


*అప్పుడు వారు షిరిడీసాయి బాబా వారి గూర్చి విన్నారు.*

*ఆ భార్యాభర్తలు షిరిడీ యాత్ర చేసి సాయి మహాత్ముని సమాధి దర్శించిరి. వారు షిరిడీలో ఉన్నప్పుడు, అదే సమయములో వేంచేసియున్న సాయి వ్యాసుడుగా పేరొందిన శ్రీ బి. వి. నరసింహ స్వామి గారిని కలిశారు.*

*నరసింహ స్వామి గారి ఆదేశం ప్రకారం, తాను వ్యాధి నివారణ కొరకు వాడుతున్న మందులు మానివేసింది.*

*సాయి విభూతి ప్రసాదం సేవించుట మొదలు పెట్టింది.*

*అలా కొంతకాలానికి వ్యాధి పూర్తిగా కనుమరుగైంది.*

*ఊదీ మహాత్యం వారికి అవగతమైనది. వారు సాయి భక్తులైనారు. వారికి సంతానం కలిగింది. కృతజ్ఞతగా వారు తమ స్వస్థలం వెంట్రప్రగడలో సాయి మందిరం నెలకొల్పదల్చినారు.*

*1941 సం. నవంబర్ 16 వ తేదీన సాయి మందిర నిర్మాణమునకు శంకుస్థాపన జరిగింది.*

*1942 సం. జనవరి 22 న సాయి మందిర ప్రతిష్ట జరిగినది.*

*అప్పుడు షిరిడీలో ద్వారకామాయి లో సాయి స్వయంగా వెలిగించిన నిత్యహోమాగ్ని " ధుని " నుండి మరొక సాయి భక్తుడు శ్రీ P. M. మోహనరావు గారిచే తీసుకు రాబడిన అగ్నిని శాస్త్రోక్తంగా 4 - 4 - 1943 రోజున మందిరంలో "ధుని "గా ప్రతిష్టింపడినది.* 

*ఆలాగునే 22 -2 -1951 నాడు శ్రీ బి. వి నరసింహస్వామి గారిచే మార్బల్ స్టోన్ సాయి విగ్రహ ప్రతిష్ట జరిగినది.*


*తాను బాబా ప్రసాదమైన ఊదీ వలన మేలుపొంది అట్టి శుభమును ధుని ద్వారా భక్తులకు అందచేసిన వెంకటరత్నం దంపతులు అభినందనీయులు.*


*ధుని ని ప్రతిష్టించిన మోహనరావు గారు సాయి కృపచే మనకు ఎన్నొ మధుర గీతాలు అందించారు.*


 *" నూరి పొసే మందు కాదండి నూరు వరహాలిస్తే రాదండి " అని పాడుకోవడమే కాదు.*

*సాయిబాబా ఊదీ మహిమ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు.*


  *సేకరణ - సాయి @ 366*


No comments:

Post a Comment