Wednesday, May 15, 2024

సాయిని సేవించిన తెలుగు వెలుగు* *తెలుగు వెలుగులు* *తెలుగునాట కేంద్రీకృతమవ్వటం పరమేశ్వరునికి ఇష్టం లేనట్లుంది -* *సాధు చరిత్రలు చూస్తుంటే.* *విశిష్టా అద్వైతి రామానుజులు శ్రీరంగంలోను, విద్యారణ్యులు శృంగేరిలోను - ఇలా ఎందరో ఉన్నారు.*

 *సాయిని సేవించిన తెలుగు వెలుగు* 

*తెలుగు వెలుగులు* *తెలుగునాట కేంద్రీకృతమవ్వటం పరమేశ్వరునికి ఇష్టం లేనట్లుంది -* *సాధు చరిత్రలు చూస్తుంటే.*


*విశిష్టా అద్వైతి రామానుజులు శ్రీరంగంలోను, విద్యారణ్యులు శృంగేరిలోను - ఇలా ఎందరో ఉన్నారు.*


*ఇటీవల ఉదాహరణగా సాయి సాంప్రదాయానికి చెందిన శ్రీ శివనేశన్ స్వామీజీని తీసుకోవచ్చు స్వామిజీ తెలుగు వారు.*


*జన్మించింది కొయంబత్తూర్ లోని రత్నశేగాపల్లి. వారి పూర్వికులు ఆంధ్ర రాష్ట్రం నుండి తమిళ ప్రాంతంలో స్థిరపడినవారు.*


*స్వామీజీ జన్మదినం* 

*12 -4 -1927.*

*భ్రమర కీటక న్యాయంలో కీటకం భ్రమర రూపం పొందుతుంది.*

 *ఆ న్యాయం సాయి భక్తులకు కూడా వర్తిస్తుంది.*

*భక్తుడైన శ్రీ శివనేశన్ స్వామి సాయి ఆకారం పొందక పోయినా, సాయి అపార కరుణతో పాటు, సాయి విభూతిని దర్శింపచేయగల శక్తిని పొందారు.*

*సాయిబాబా వలె తనకంటూ యేమీ మిగుల్చుకోలేదు.* 

*సాయి భక్తికి ఆయన జీవితం ఒక ప్రయోగ శాల* 

*బాబా తన భక్తుల ను సర్వ అవస్థలలోను కాపాడుతారు అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.*

*ఏ కొద్దిపాటి భక్తితోనే పరవశించిపోయే సాయి, అనన్య భక్తిగలవారికి సిద్ధులను ప్రసాదిస్తాడు.*

*అయితే అనుక్షణమూ తన ద్వారా ఆ మహిమను సాయి చూపాడు అని, ఆ మహిమ తనది కాదనీ సృహ క్షణం క్షణం ఉండాలి.*

*శివనేశన్ స్వామి అనేక లీలలు చూపినా, కారణం సాయిబాబాయే అని ఎటువంటి సంకోచం లేకుండా చెప్పేవారు.* 

*పేదవారికి గాని, ఇతర జీవులకు గానీ సేవ చేసినప్పుడు "నీది నీకే అర్పిస్తున్నాను. నాదేమీ లేదు " అని భావన ఊపిరి కావాలి,  చేసే ప్రతిపనిలో శ్రద్ద ఉండాలి.*

*ప్రతి పనిని సేవాకార్యంగా ఎలా మల్చుకోవచ్చో చింతన చేయాలి.*

*సాయికి అర్పించిన పూలదండలు పశువులకు ఆహారంగా ఇవ్వవచ్చును.*

*అలా చేసేముందు స్వామీజీ వలె పూలదండలకున్న దారాలను తీసివేయాలి.*

*సబ్ కా మాలిక్ ను సేవించిన సాయి సేవక్ ను స్మరిద్దాం.*


 

*సాయి @ 366 నుండి* 

*(ఈ సమాచారం నిన్నటిదిగా భావించ వలెను.)*

No comments:

Post a Comment