*ఆరతుల భావము.*
*తాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల పేర్లు తెలియవు.*
*ఆలాగునే సాయిబాబా సాహిత్యంలో కూడా కొందరి పేర్లు తెలియవు. వారు చేసిన కృషి మిగిలిపోతుంది.*
*వారు కీర్తిశేషులు కాదు. ఎందుకంటే పేరు తెలిస్తేగదా ఆయనను కీర్తిశేషుడని అనేది. ఆ కోవకు చెందినవారే శ్రీ ద్వివేది వెంకటేశ్వర శర్మగారు.* *సంస్కృత, ఆంధ్ర, మరాఠి, తెలుగు భాషలలో పాండిత్యం సంపాదించిన శర్మగారు శ్రీ శ్రీ శ్రీ విమలానంద భారతీ స్వాముల వారికి (కుర్తాళం ) రచనలలో తోడ్పడేవారు కూడా.*
*కీర్తి ఆపేక్షించని వ్యక్తి ఆయన.*
*ఆయనకు సాయిబాబా అంటే తెలుగువారికి ఎంత భక్తి ప్రపత్తులో తెలుసు.*
*షిరిడీలో నాలుగు వేళలా పాడే ఆరతులను మరాఠి భాష తెలియకపోయినా కొద్దో గొప్పో నేర్చుకొని సాయి బాబా ముందు ఆ హారతులను గృహాలలోను, సాయి మందిరాలలోను హారతులు ఇచ్చేవారు మనవారు.*
*అన్ని హారతులను తెలుగు లిపి లొనే కాకుండా, వాటి భావాన్ని కూడా తెలుసుకొంటే బాగుంటుందని, సికింద్రాబాద్ లోని నల్లగుట్ట సాయి మందిర వ్యవస్థాపకుడైన శ్రీ దేవరశెట్టి అంజయ్యగారికి అలోచన వచ్చింది.*
*అయితే అలాంటి అలోచన ఎందరికో వచ్చినా కార్యరూపం దాల్చలేదు.*
*శ్రీ దేవరశెట్టి అంజయ్యగారు, శ్రీ ద్వివేది వెంకటేశ్వర శర్మగారిని కోరారు.*
*అది సాయి సంకల్పం.*
*సత్సంకల్పం.*
*దానికి శ్రీ శర్మగారు అంగీకరించారు*
*అంతేకాదు, దానికి శ్రీ షిరిడీ సాయి సంస్థాన్ వారు అనుమతించాలి.*
*బాబా అనుగ్రహముతో, ఆనాటి షిరిడీ సాయి సంస్థాన్ తరపున ఉన్న శ్రీ k .S .పాఠక్ (కోర్టు రిసీవర్ ) అంగీకరించారు.*
*శ్రీ శర్మగారి "శ్రీ సాయిబాబా పూజా విధి ( సగుణోపాసన ) షిరిడీలో జరుగునట్లు తెలుగు లిపిలో అనువాదమును రచించారు.*
*దానిని షిరిడీ సాయి సంస్థాన్ వారి అనుమతితో నల్లగుట్ట బాబా మందిరం వారు ముద్రించారు.*
*ఆ గ్రంథం 1976 సం .శ్రీ రామనవమి రోజున అటు షిరిడీలోను, ఇటు సికింద్రాబాద్ లోనూ ఏప్రియల్ 9 వ తేదీ 1976 సం నాడు విడుదలచేశారు.*
*ఆ గ్రంథం మొదటిగా పూజావిధితో పాటు ఆరతులను తెలుగు లిపిలోనే కాకుండా వాటి తాత్పర్యం కూడా ఇచ్చినది.*
*ఆ హారతుల గ్రంథం విడుదల జరిగి నేటి 48 సంవత్సరములు ముగిసినవి.*
*శ్రీ ద్వివేది వెంకటేశ్వర శర్మగారు ఎవరో సాయి భక్తులకు తెలియక పోవచ్చును గానీ వారి రచన చిరంజీవి.*
*సేకరణ - సాయి @ 366 గ్రంథం.*
No comments:
Post a Comment