Thursday, May 16, 2024

పాపపుణ్యాలు, నీడలు మనిషి వెంటే వుంటాయి

 *పాపపుణ్యాలు, నీడలు మనిషి వెంటే వుంటాయి.*


*ఏ పనిచేసినా అందులో పాపమో, పుణ్యమో ఉండి తీరుతుంది. ఏ ప్రయోజనం లేకుండా, ఏ పనీ ఉండదు.* 


*మనిషి ఏ పని చేయకుండా ఎక్కువకాలం ఉండలేడు.*


*పాపపుణ్యాలు వెలుగు నీడలవంటివి.*

*పుణ్యం వెలుగైతే, పాపం చీకటి.*

*అలాగే పాపం పుణ్యం, నీడ మనిషి వెంటే వుంటాయి.* 


*మనిషి ఈ జీవన సత్యాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.*


*ఈ నాలుగు వాక్యాలు గమనించండి.*


*1 వచ్చేవి, పోయేవి, పేదరికం, డబ్బు.*


*2 వచ్చినా వదలిపోనివి కీర్తి, జ్ఞానం, విద్య.*


*3 పోతే రానివి కాలం, యవ్వనం, పరువు.*


*4 వెంటవచ్చేవి, పాపం, పుణ్యం, నీడ .ఇవన్నీ యదార్ధాలే.*


*నిత్యసత్యాలే.*

*ఇవి మనిషికి తెలియనవిమేమి కావు.*

*కానీ వాటిని గుర్తుంచుకుని ఆచరించడంలో చాలామంది విఫలమవుతున్నారు.*

*అందుకే అసమానతలు, అసంతృప్తులు పెరిగిపోతున్నాయి.*


*పేదరికము అనేది స్థిరంకాదు.*


*నేటి బికారి రేపు కోటీశ్వరుడు కావచ్చు. రాత్రికి రాత్రే అపారంగా సంపదలు వచ్చి పడవచ్చు.*


*ధనవంతుడు పేదవాడు కావచ్చు.*

*బండ్లు ఓడలు, ఓడలు బండ్లు కావచ్చు. అందువల్ల పేదరికము స్థిరం కాదు.*


*వ్యాధికూడా అంతే.*

*వ్యాధిగ్రస్తుడు ఒక్కొకసారి మృత్యుముఖంలోకి వెళ్ళినట్లే అనిపిస్తుంది.*


*సకాలంలో సరైన వైద్యం లభించినప్పుడు వ్యాధి నయమై స్వస్తత చేకూరుతుంది.* 


*వ్యాధితో మరణిస్తాడనుకొన్నవాడు ఆరోగ్యవంతుడై నూరేళ్లు జీవించవచ్చు.*


*డబ్బుకూడా అంతే. అది లక్ష్మీ స్వరూపము. లక్ష్మికి ' చంచల ' అని పేరు.*

*అంటే ఎక్కడా నిలకడగా ఉండకుండా సంచరిస్తూ ఉంటుంది.*

*క్షణాల్లాలో చేతులు మారే డబ్బు వస్తూ పోతుండే జీవితావసరం.* 


*కీర్తి ఒక్కసారి వస్తే చాలు. అది అలాగే ఉండిపోతుంది. కీర్తిని సంపాదించుకోవడమే కష్టం.*


*నిరంతర శోధన, సాధన లేనిదే కీర్తి రాదు. జ్ఞానమూ అంతే.*

*జ్ఞానవంతులైన గురువులను అశ్రయించాలి.*


*మనిషి జీవితంలో యవనం అనేదీ ఒక దశమాత్రమే.*

*అది కొంతకాలమే ఉంటుంది.*

*తరువాత యెన్ని రంగులు వేసుకొన్నా శరీరములో వచ్చిన మార్పులు ఎలా పోతాయి ? కనుక యవ్వనం పోతే రాదు.*


*పరువు కూడా అంతే.*

*పరువుకోసం పరితపించేవాళ్ళు ఉత్తములు.*


*పరువు పోతున్నా పట్టించుకోని వాళ్లు అధములు, పరువుపోతే తిరిగి రాదు.*

No comments:

Post a Comment