*అద్వితీయ సాయి పత్రిక.*
*18 -3 -1923 ఆదివారము.*
*( తిథి ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి ).*
*ఆ శుభదినాన శ్రీ సాయి లీలా పత్రిక ప్రారంభమైనది.* *సాయి పరంగా ఇది రెండవ పత్రిక.*
*సాయి భక్తుడైన హరి వినాయక్ సాఠే మొదటి పత్రిక పూనా నగరాన్ని నుండి విడుదల చేశారు. ఐతే అది కొద్దికాలానికి మూసివేశారు.*
*శ్రీ సాయి లీలా పత్రిక ప్రచురించి నేటికి 101 సంవత్సరాలు ముగుస్తాయి.*
*శ్రీ సాయి లీలా పత్రికకు మొదటి సంపాదకుడు శ్రీ గణేష్ లక్ష్మణ్ మహాజని. ఆయనను అందరూ "కాకా మహాజని " అని పిలుస్తారు.*
*పత్రిక మరాఠి భాషలో ఉండటం వల్ల సంపాదకీయం కూడా మరాఠి భాష లొనే ఉండేది.*
*మొదటి మొదటి పత్రిక నమూనాగా విడుదల చేశారు. సాయి భక్తులకు పత్రిక కాపీ ఉచితంగా పంపి వారిని చందాదారులుగా చేరమని, పత్రికను ప్రోత్సహించమని మనవి చేశారు. పత్రిక స్థాపనకు ముఖ్యంగా రెండు ఉద్దేశాలతో ప్రారంభించారు. అవి ఏమనగా సాయి లీలలను అన్నిటిని పోగుచేసి ప్రచురించటం కష్టం.*
*కనుక వీలైన సాయి లీలలను పోగుచేసి ప్రచురించటం-ఇంకా భక్తుల అనుభవాలను భక్తుల శీర్షిక కిందను, శ్రీ సాయి సచ్చరిత్రను ధారావాహికంగా ప్రచురించటం.*
*అలా మొదలైన ఈ పత్రిక ఇంతింతై వటుడింతై నట్లు,అనేక వేల కాపీలతో, అనేక భాషలలో, దేశ విదేశి భక్తుల మరియు ఇతరుల ఆదరాభిమానములు పొందినది.*
*ఆనాడు హేమాడ్ పంత్ ప్రారంభించిన సాయి సచ్చరిత్ర తరువాత ఆంగ్ల భాషలో కూడా అనువదించి ప్రచురితమైనది.*
*సాయి లీల పత్రిక సాయి సచ్చరిత్ర నుదుటి తిలకం.*
No comments:
Post a Comment