*షిరిడీలో సాయిబాబాను దర్శించడానికి సామాన్యులే కాదు, ఎందరో మహాత్ములూ కూడా వచ్చేవారు.*
*అలా దర్శించి సాయిబాబా మహిమను చాటేవారు కూడా.*
*అలాగా ఆనందనాధ్ మహరాజ్, గంగాఘీరు మున్నగువారు ఎందరో విచ్చేసేవారు.*
*సాయిబాబా మహా సమాధి చెందిన తరువాత, భౌతికంగా ఆయన కనిపించకున్నా ఆయనను సూక్ష్మ రూపంలో దర్శించగల అసామాన్యులు ఎందఱో వేంచేసేవారు.*
*షిరిడీలో అక్కడ సాయి సేవలో అంకితమైన శ్రీ శివనేశన్ స్వామి గారు సాదరంగా ఆ మహాత్ములను ఆహ్వానించేవారు.*
*నాగపూర్ సమీపాన గల పరాడ్ సింగ్ అనే గ్రామములో యోగిని అనసూయ మాత*
*5 -5 -1926 సం.లో జన్మించినది. ఆమెకు చిన్నతనం నుండి భగవద్భక్తి అధికంగా ఉండేది. ఆమె భగవన్నామ సంకీర్తన చేసేటప్పుడు బాహ్య దేహ స్మృతి కోల్పోయేది. షిరిడీలో సాయి వలె అనేక లీలలు చూపేది.*
*సాయిబాబా సజీవంగా ఉన్నప్పుడు ఇమాంబాయి అనే భక్తుడుకి ఒక రోజున "అతిధులు వస్తున్నారు నాలుగు కోళ్లను తీసుకురా !" అని బాబా చెప్పి అతనిని పంపారు.*
*ఎవరా అతిథులు ? అని ఒక ఉత్సుకత. అతడే ఆ రాత్రి ద్వారకామాయి తెర వెనుక దాక్కున్నాడు.*
*పాపం సాయిబాబాకు తెలియదనే భావముతో. అదే రాత్రి రెండు గంటలకు అడుగుకు పైగా వ్యాసమున్న ఒక అగ్నిగోళం మసీదులోకి దూసుకు వచ్చింది.*
*మిరుమిట్లు గొలిపే కాంతితో మశీదు అంతా నిండిపోయింది.*
*మరొక భక్తుడు అప్పాభిల్ కూడా అక్కడే ఉన్నాడు.*
*సాయిబాబా అరబిక్ భాషలో ఏదో ఉచ్చరించారు.*
*10 -15 నిమిషాల తరువాత అంతా మామూలైంది.*
*అలాగే యోగినీ, మహాత్మురాలైన అనసూయ మాతా కూడా ఒకసారి అక్కడ వారితో " చుట్టాలు వస్తారు " అని తెలిపింది. కొద్దిసేపటికి ఒక పిడుగు వచ్చి భూమిలోకి దిగిపోయింది. అనసూయ మాతను అనేక మంది సాధు సత్పురుషులు దర్శించుకున్నారు.*
*ఆమె బాబా మహాసమాధి అనంతరం షిరిడీకి వచ్చి, సాయి సమాధిని దర్శించ్చుకొన్నది.*
*అక్కడ గల సాయి సేవక్ శ్రీ శివనేశన్ స్వామీజీ అనసూయ మాత పాదములపై శిరస్సు వంచి నమస్కరించారు.*
*ఇది శివనేశన్ స్వామికి సాధు సత్పురుషుల ఎడల భక్తీ ప్రపత్తులను తెలియచేస్తుంది.*
*సాయిబాబాను దర్శించే మహనీయులందరూ అందరూ వందనీయులే.*
*సాయినాథుని దర్శించిన మహత్ములను వారి వారి జయంతి, వర్దంతి నాడైనా స్మరించుట మాన కర్తవ్యం.*
🔥⚡️🔥⚡️🔥⚡️🔥⚡️🔥
No comments:
Post a Comment