Saturday, May 25, 2024

షిరిడీలో సాయి సన్నిధిలో అంటే, సమాధి మందిర ప్రాంగణంలో, ఎన్నొ మందిరాలు, ఉద్యానవనం, భక్తుల సమాధులు ఉన్నాయి

*షిరిడీలో సాయి సన్నిధిలో అంటే, సమాధి మందిర ప్రాంగణంలో, ఎన్నొ మందిరాలు, ఉద్యానవనం, భక్తుల సమాధులు ఉన్నాయి.*
*ఆ సమాధులలో ఒకటి శ్రీ వి. పద్మనాభ అయ్యర్ ది.*
*ఆయన కోపెరగాన్ సమీపములో గల 
లక్ష్మీవాడిలో చక్కర (పంచదార ) తయారు చేయు కర్మాగారంలో షుగర్ 
టెక్నాలజిస్టు.*
*అతను సాయికి పరమ భక్తుడు. అతను ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చినవాడు. ఆయన భార్యా బిడ్డలు లక్నౌ నగరము లో ఉండెడివారు.*
*ఆయనకు 1943 సం. వరకు ఎటువంటి ఉద్యోగం దొరకలేదు. ఆయన ఆరుగురు సంతానం పాఠశాలలో చదువు కొండెడివారు. ఆయనకు కుటుంబ భారం పెద్దది అయినా చింతలేదు.*

*అన్నీ సాయినాధుడే సమకూరుస్తాడు అనే విశ్వాసం కలిగినవాడు. 1944 సం. లో కోపెరగాన్ లక్ష్మీవాడిలో ఉద్యోగం వచ్చింది.*
*" చూసారా ! సాయిబాబా కృప ! ఆయన నన్ను తన దగ్గరకు రప్పించు కొన్నారు " అని చెప్పెడివాడు.*
*లక్ష్మీవాడి నుండి సమయము చిక్కినప్పుడల్లా షిరిడీ వెళ్లెడివాడు. సాయి హరతులలో పాల్గొనెడివాడు.*
*అయ్యరు సమాధి మందిరంలో ఉన్నప్పుడు పూర్తిగా బాహ్యసృహ లేకుండా సాయి రూప చింతనలో మునిగి పోయెడి వాడు. సమయం తెలియకుండా భక్తి పారవశ్యంలో లీనమయి పోయేవాడు.* 
*అప్పుడు అక్కడ ఉన్న భక్తులు " మీరు లక్ష్మీవాడి ఉద్యోగానికి వెళ్ళాలి కదా " అని గుర్తు చేస్తే కదలి వెళ్ళేవాడు.*
*అది 26 -5 -1945 తేదీ, అతనికి లక్ష్మీవాడిలో ఉద్యొగ కాలము ముగిసిపోయింది. అక్కడ మిల్లులో అతనికి ఇక పనిలేదు. ఆ సమయములో అతని కొడుకులు కూడా అతనితో పాటు లక్ష్మీవాడిలో ఉన్నారు.*
*ఇక అతనికి పని లేనందున, తన స్వంత ఊరైన లక్నౌ వెళ్లేందుకు నిర్ణయించుకొని, చివరిసారిగా తన కుమారులతో కలసి ఒకరోజు సాయంకాలం షిరిడీలో బాబా దర్శనానికి వెళ్లారు.*
*అయ్యరు సమాధి మందిరములో స్తంభానికి ఆనుకొని కూర్చున్నాడు. కళ్లు మూసుకొని సాయిబాబాను ధ్యానించసాగాడు.*
*ఆయన కనులవెంట కన్నీళ్లు ధారలుగా కారసాగాయి. చుట్టుప్రక్కల ఏమి జరుగుతుందో తెలియని స్ధితిలోఉన్నాడు. అక్కడ గలవారు ఆయనతో మాట్లాడానికి ప్రయత్నించారు.* 
*రాత్రి తొమ్మిది గంటలకు సృహ వచ్చి అతి కష్టం మీద సమాధి మందిరం నుండి బయటకి వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లొ అతను తెల్లవారుజామున తనకు అనారోగ్యంగా వుందని కుమారులని లేపాడు.*
*డాక్టర్లు వచ్చి ఆయనకు కలరా వ్యాధి వుందని తెలిపారు.*
*కొంతసేపటికి అయ్యరు అక్కడ వారితో తనకు సాయిబాబా పటం కావాలన్నాడు.*
*వారు సాయి పటాన్ని ఇవ్వగా దానిని గుండెల మీద పెట్టుకొని " సాయిబాబా ! బాబా !" అంటూ తుది శ్వాసవిడిచాడు అయ్యరు.* *అయ్యర్ భక్తిని అందరూ కొనియాడారు. కొందరు భక్తులందరూ షిరిడీ సాయి సంస్థాన్ వారిని కలసి, సమాధి మందిర ప్రాంగణంలోనే ఆయనకు సమాధి యేర్పాటు చేశారు.* *ఆయనకు శాశ్వతంగా సాయి సన్నిధిలో స్థానం లభించింది.*

 *(షిరిడీ సాయినాథుని దర్శనానికి వెళ్ళే భక్తులు సమాధి మందిర ప్రాంగణములో కల అయిదుగురు సాయి భక్తుల సమాధులను దర్శించగలరు. ఆ అయిదు సమాధులలో ఒకటి "శ్రీ వి.పి. అయ్యరు ది )*

No comments:

Post a Comment