Wednesday, May 15, 2024

చైత్ర కృష్ణ ద్వాదశి* *శ్రీ బావు మహారాజ్ కుంబార్ పుణ్య తిధి*

  చైత్ర కృష్ణ ద్వాదశి*


 *శ్రీ బావు మహారాజ్ కుంబార్ పుణ్య తిధి*



*మనకు షిరిడీ దర్శనంలో సమాధిమందిర ప్రాంగణములోగల లేండీబాగ్ సమీపంగా అయిదుగురు సాయిబాబాను అనన్యముగా ప్రేమించి, సేవించిన అయిదుగురు సాయి భక్తుల సమాధులు దర్శనమిస్తాయి.*


*అవి హాజీ అబ్దుల్ బాబా, భావు మహరాజ్ కుంభార్, నానావల్లి, వి .పి. అయ్యరు, తాత్యాకోతే పాటిలు.*

*అందులో ఒకరైన భావు మహరాజ్ కుంభార్ యుక్తవయసులోనే అధ్యాత్మిక చింతన, వైరాగ్య భావన తో సంగమనేరు జిల్లాలో కల ఒక పల్లెటూరు నుండి సాయిబాబా దర్శనార్థం శిరిడీకి వచ్చాడు.*


*ఆయన షిరిడీ సమాధి మందిర ప్రాంగణములొకల శని మందిరం వద్దను, రహతా వెళ్ళు దారిలోగల మర్రి చెట్టు నీడను ఉండేవాడు.* 


*కుంభార్ దయార్థుడు.*

*ఆయన చిన్న పిల్లలను, వృక్షాలను అమితంగా ప్రేమించేవాడు* 


*షిరిడీలో భిక్ష చేసికొని బ్రతికెడివాడు.*

*ఆయన షిరిడీ దర్శించు యాత్రికులనుండి భిక్షాటన చేసి, పేదవారికి, నిరాశ్రయులకు ఆ ధనాన్ని వితరణ చేసెడివాడు.*

*ఒక్కొక్కప్పుడు తన వద్ద గల కొద్దిపాటి డబ్బుతో పంచదార కొని పిల్లలకు పంచెడివాడు.*

*అప్పడప్పుడు వ్యాధులతో  బాధపడే పేదవారికి మందులు కొని ఇచ్చెడివాడు.*

*భావు మహరాజ్ షిరిడీ గ్రామస్తులతో చాలా గౌరవంతో, మృదువుగా మాట్లాడేవారు.*


*ఆయన కున్న సంపద అంతా ఒక ఖాదీ పంచె, తలపై ఒక తెల్లని టొపీ.*

*భుజాన ఒక ఉన్ని దుప్పటి.*


*భావు మహరాజ్ షిరిడీలోగల వీధులన్నీ ఆయన భుజాన వేసుకునే దుప్పటితో శుభ్రపరచెడివాడు.*

*అంతేగాక గ్రామములొకల మురుగు కాల్వలు అన్నీ శుభ్రం చేసెడివాడు.*


*చీకటి పడక ముందే వీధులలో గల చెత్తా చెదారాన్ని తీసి, తన పనులన్నీ ముగించుకుని సాయంకాలము బాబా మందిరానికి రహస్యముగా వెళ్ళి దర్శనం చేసుకునేవాడు.*

*సాయిబాబా ఆయనతో సంభాషించెడివాడని ప్రతీతి.*

*బాబా ఆయనతో తన అధ్యాత్మిక సందేశాలన్నీ వినిపించి, మార్గదర్శనం చేశాడు.*

*ఒకసారి బాబా సమాధి మందిర నిర్మాణం చెందిన గోపాల్ ముకుంద్ బుట్టి, భావు మహరాజ్ ను, బాబా తో ఆయన సంభాషణ గూర్చి అడుగగా " బాబా నాకు ఆయన తినే రొట్టెలో నాలగవ వంతు ఇస్తారు.*

*మరియు అనేక సందేశాలు కథల రూపములో చెప్పెడివారు అని."*


*భావు మహరాజ్ అరోగ్యము క్షీణించసాగింది.*

*ఆయన ఆహారము తీసుకోవడం మానివేశారు.*


*బాబా భక్తులైన పురంధరే, సగుణమేరు నాయక్ భావు మహరాజ్  శరీర త్యాగము ముందు ఆయనకు ఎంతో సేవలు చేశారు.*


*27 -4 -1938 నాడు ఆయన దేహత్యాగము చేసి తన ప్రభువు, గురువైన సాయినాధునిలో ఐక్యము చెందారు.*


*షిరిడీ దర్శించు భక్తులందరూ భావు మహరాజ్ కుంభార్ సమాధి దర్శించుకొనగలరు.*

No comments:

Post a Comment