*అ.. అమ్మలా ఆదుకుంటావు సాయి!*
*ఆ ..ఆత్మ బంధువు నీవే సాయి!*
*ఇ.. ఇచ్చలన్ని తీరుస్తావు సాయి!*
*ఈ.. ఈతి భాధలు తొలగిస్తావు సాయి!*
*ఉ.. ఉన్న దానితో ఆనందంగా ఉండాలంటావు సాయి!*
*ఊ..ఊహాలలో దర్శనం ఇస్తావు సాయి!*
*ఎ...ఎప్పుడు నీదయ నాపై ఉండాలి సాయి!*
*ఏ.. ఏనాటి పుణ్య ఫలమో..నీ దయ నాపై కురిసే సాయి!*
*ఐ.. ఐశ్వర్యం అంటే నీవే కదా సాయి!*
*ఒ..ఒక్కసారి కలనైన కానరావా సాయి!*
*ఓ... ఓ మారు నీ చల్లని చూపు నాకు*
*ప్రసాదించు సాయి!*
*ఔ... ఔషధ సేవనం లేని జీవనం నాకు ఇవ్వు సాయి!*
*అం..అందరి భందువు నీవే సాయి!*
*క...కలిమిలేములను ఒకేలాగా స్వీకరించే ధైర్యం ఇవ్వుము సాయి!*
*ఖ.. ఖడ్గము లా నా కష్టాలను కడతేర్చుము సాయి!*
*గ..గత జన్మ పాపాల పారద్రోలుము సాయి!*
*ఘ... ఘనమైన సంపద ఇక నీవే సాయి!*
*చ..చల్లని చూపుల..చిన్మయ సాయి!*
*ఛ... ఛత్ర ఛామరాలేవి కోరవీవు సాయి!*
*జ... జన్మ రాహిత్యం నాకు కలిగించు సాయి!*
*ఝ... ఝాన్సిరాణి లాంటి ధైర్యం నా కివ్వు సాయి!*
*ట.. టక్కరి దొంగలైన అరిష్వర్గాలను నా దరి చెరనివ్వకు సాయి!*
*డ.. డాలువై కత్తుల లాంటి మాటల తూటాల బారి నుండి నను కాపాడు సాయి!*
*త.. తల్లీ తండ్రీ నీవే సాయి!*
*థ.. కథనాలు..కల్పనల నుండి నను కావుము సాయి!*
*ద...దయగల దైవము నీవే సాయి!*
*ధ... ధైర్యం ఇచ్చే దేవుడవీవు సాయి!*
*న...నను కాపాడ వచ్చిన నారాయణుడే నీవు సాయి!*
*ప.. పసిపాపలాంటి చల్లని నవ్వు నీది సాయి!*
*ఫ.. ఫలము లభించును నిను సేవింప సాయి!*
*బ..బంగారు వెండి కానుకలను అర్పించలేను సాయి!*
*భ.. భక్తి శ్రద్ధలతో పూజించి అర్చింతు సాయి!*
*మ... మన్నించి మము బ్రోవుమా షిరిడి సాయి!*
*య... యదుకుల నందన..శ్రీ కృష్ణ సాయి!*
*ర.. రక్షించు మము రాగ ద్వేషాల నుండి సాయి!*
*ల... లక్ష నామాల నిను కీర్తింతు సాయి!*
*వ.. వందనములివే అందుకో సాయి!*
*శ.. శక్తి యుక్తుల శంకర సాయి!*
*ష.. షిరిడి లోన కొలువున్న సాయి!*
*స..సంపద అంటే నీవే సాయి!*
*హ...హారతి గైకొనుము షిరిడి సాయి!*
*ళ.. భోళా శంకర షిరిడి సాయి!*
*క్ష.. క్షణమైన నీ పాదం ఇక విడువను సాయి!*
*అక్షర మాలతో అర్చింతు సాయి!*
*నీ భక్తుల మనసున కొలువుండు సాయి !*
*#sharadasrinivas*
No comments:
Post a Comment