Tuesday, May 14, 2024

ఎవరు ఎంతెంత దూరంలో ఉన్నా, సాయిబాబా అందరి అంతరంగాలను తెలుసుకునే అంతర్జ్ఞాని మద్యన ఎన్ని ఆటంకాలు ఉన్నా బాబా దృష్టికి అవేవీ అడ్డుపడవు.* *ఎంతగోప్యంగా ఉంచినా ఆయనకు తెలుస్తుంది. ఆయనకు సర్వమూ తెలుసు.*

 *"ఎవరు ఎంతెంత దూరంలో ఉన్నా, సాయిబాబా అందరి అంతరంగాలను తెలుసుకునే అంతర్జ్ఞాని మద్యన ఎన్ని ఆటంకాలు ఉన్నా బాబా దృష్టికి అవేవీ అడ్డుపడవు.* *ఎంతగోప్యంగా ఉంచినా ఆయనకు తెలుస్తుంది. ఆయనకు సర్వమూ తెలుసు.* 

*ఈ జగమంతా సాయిమయం కనుక "సంకలనం -తాతపూడి బ్రహ్మానంద శాస్త్రి.*

----------------------------------------

*" ఆజ్ఞా ప్రతిహతా సిద్ది " అంటే తిరుగులేని విధముగా ఆజ్ఞాపించడం. ఈ సిద్ధిని సాయిబాబా చాలా చోట్ల చూపించారు.*

*బాబా ఒకసారి కప్పను పట్టుకున్న పాముతో "ఓయీ ! వీరభద్రాప్పా ! నీ ద్వేషబుద్ధికి సిగ్గుపడు.*

*ద్వేషాన్ని విడిచిపెట్టు." అని అనగానే పాము (వీరభద్రప్ప -చెన్నబసప్ప కథ - సాయిసచ్చరిత్ర 47 వ అధ్యాయము ) కప్పను (చెన్నబసప్పను ) విడచింది.* 

*సాయినాథుని వాక్కు లేదా ఆజ్ఞ సర్వ చరాచరాలకు వర్తిస్తుంది.*

---------------------------------------------------

*షిర్డీ నివాసి అయిన అప్పాసుతార్ తన చర్మ రోగ నివారణ కోసం అనేక ప్రదేశాలు తిరిగాడు.* 

*అతడు నాసిక్ గవర్నమెంటు హస్పిటల్లో ఉండగా ఒకరోజు సాయిబాబా అతని కలలో కనిపించి " నీవు వెంటనే షిర్డీ వెళ్లి, పారాయణ చెయ్యి " అని అన్నారు.*

*"బాబా ! నేను హస్పిటల్ లో ఉన్నాను " అని అతడు చెప్పినా, బాబా అతణ్ణి షిర్డి వెళ్ళి పారాయణ చేయమన్నారు.*

*బాబా అదేశానుసారం షిర్డీ వెళ్లిన అప్పాసుతార్ కు, విఠల్ రావు అను మరాఠి వ్యక్తి కనబడి " అప్పా, నేను సిరువాల్ అనే ఊరు వెళుతున్నాను. నేను వచ్చేదాకా పారాయణ చేయి " అని చెప్పాడు.*

*అతను షిరిడీలో జ్ఞానేశ్వరి, ఏకనాధ భాగవతం, భావార్ధ రామాయణము, శ్రీసాయి సచ్చరిత్ర పారాయణ చేసి, ఊదీ రాసేవాడు.*

*బాబా చెప్పినట్లు ఆ గ్రంథాలు పారాయణ చేయగానే అప్పాసుతార్ కు ఉన్న చర్మవ్యాధి తొలగిపోయింది.*

No comments:

Post a Comment