Tuesday, May 14, 2024

సర్వదేవతా స్వరూపుడైన సాయిబాబా, అన్ని మతాలకు ఆరాధ్య దైవముగా పూజింపబడుతున్నాడు

 *మా యేసు నీవేనని మా ప్రభువు నీవేననీ,ప్రార్ధనలు చేసేము సాయీ !*


*సర్వదేవతా స్వరూపుడైన సాయిబాబా, అన్ని మతాలకు ఆరాధ్య దైవముగా పూజింపబడుతున్నాడు.*


*వివిధ మతాల వారికి వారి ఇష్ట దైవంగా దర్శనం ప్రసాదిస్తున్నారు.*


*మిస్ దంతాన్ అనే క్రైస్తవ సన్యాసిని 1960 సం.మధ్య సమయములో కలకత్తా నగరములో నివసించేది.*

*ఆమె ఒక కాన్వెంట్ లో జీవితం గడిపేది. అక్కడ ఆమె ఇబ్బందులు ఎదుర్కొని, చివరకు ఆ ప్రదేశాన్ని విడిచి వచ్చేసింది.*


*తరువాత అనేక కష్టాలు మొదలైయ్యాయి. ఆమె వయసు పెద్దదై పోయింది. జీవన వృత్తి లేదు. చుట్టాలు అన్నవారు లేరు .ఆమెకు దగ్గర బంధువు ఒకడు ఎక్కడో కలకత్తాకు దూరంలో ఉన్నాడు.*


*ఒకనాడు తన చిన్న గదిలో విచారములో ఉండగా హఠాత్తుగా పొడుగాటి ఒక ఫకీరు ప్రత్యక్షమయ్యారు.*


*ఆయన తన గదిలోకి ఎలా ప్రవేశించాడో చెప్పలేకపోయింది.* 


*ఒక క్రైస్తవ సన్యాసిని గదిలో ఒక ముస్లిం ఫకీర్ ప్రవేశించడం అసంభవం.*


*ఆ ఫకీర్ దయగా ఆమె వైపు చూసి " అంతగా విచారపడకు. కొన్నాళ్ళకు అంతా చక్కబడుతుంది " అని పలికి దక్షిణ అడిగారు.*


*తన దగ్గర డబ్బేమీ లేదని ఆమె చెప్పగా, ఆ ఫకీర్ అక్కడ అలమారు లో ఉన్న పెట్టెలో ముప్ఫై అయిదు రూపాయలున్నాయి " అని చెప్పగా, ఆ విషయము మరిచిపోయాను, అని చెప్పినది.*

*ఆ డబ్బు తీసుకుని వచ్చి ఆ ఫకీరుకు ఇద్దామని వెళ్లి వచ్చేసరికి ఆ ఫకీర్ అదృశ్యమయ్యారు.*


*ఆ ఫకీర్ కనిపించిన తరువాత ఆమెకు ఎంతో మానసిక ప్రశాంతత లభించింది.*


*అనుకోకుండా ఆమె దూరపు బంధువు ఆమెకు జీవాతాంతం సంరక్షన కలిగించాడు.*


*తనను సంరంక్షించిన వ్యక్తికి కృతజ్ఞలు తెలుపుటకు చర్చికి వెళ్ళి ఆరాధన (mass ) లో పాల్గొని ధన్యవాదాలు‌ తెలిపేది.*


*సర్ ఆర్ధర్ aasborne  అనే విదేశీయుడు షిర్డి వెళ్ళి బాబా సమాధి దర్శించాడు.*


*ఆ దర్శనం ఆయనకు ఎంతో ఆనందం కలిగించింది.*


*అనుకోకుండా ఆయన మిస్ దంతాన్ ను కలిసాడు.* 

*ఆయనకు ఆమె ఫకీర్ వృత్తాంతం తెలిపింది.*


*" మీరు చూసిన ఫకీర్ బొమ్మ చూపిస్తాను " అని చెప్పి తన పేంట్ లో వున్న షిర్డి సాయిబాబా పటం తీసుకుని వచ్చి ఆ ముసలావిడకు చూపించాడు.*


*ఆ పటం చూపించగానే ఆశ్చర్యంతో "ఈయనే ఆ ఫకీర్. తలకు అచ్చంగా ఈ తెల్ల గుడ్డే వుంది. ఆమె అంతకు ముందెన్నడూ సాయిబాబా పేరు వినలేదు.*


*సర్వ మతాలవారు తన బంధువులేనన్న అపూర్వ ప్రేమ స్వరూపుడు షిర్డి సాయినాధుడు.*


*ఈ పవిత్ర క్రిష్టమస్ పర్వ దినమున " మా యేసు నీవేనని, మా ప్రభువు నివేనని ప్రార్ధన చేద్దాము.*


No comments:

Post a Comment