దత్త జయంతి సందర్భంగా.*
*బ్రహ్మ రుద్రాంశలతో కూడిన విష్ణువ్యాంశతో జన్మించిన స్వామి దత్తాత్రేయస్వామి.*
*కుష్టు రోగ పీడితుడైన సూర్యభగవానుని ఆశ్రయం కల్పించినవాడు దత్తాత్రేయస్వామి.*
*దేవతల చేత జంభాసురుని సంహరింపచేసినవాడు దత్తాత్రేయస్వామి.*
*పొట్టిచేతులతో పుట్టిన కార్త్య వీర్యార్జునుకి వేయి చేతులు, అష్టసిద్దులు, అద్భుత పరాక్రమాన్ని ప్రసాదించిన మహత్ముడు దత్తాత్రేయస్వామి.*
*విష్ణు దత్తునికి అనేక సిద్దులు వరమొసగి లోకోపకారం చేసినవాడు దత్తాత్రేయస్వామి.*
*వేదశర్మ అనే బ్రాహ్మణుని కుమారున్ని రక్షించాడు.*
*శ్రీహరి అవతారమైన పరశురామునికి జ్ఞానం ప్రసాదించినవాడు.*
*ఇలాంటి అద్భుతాలు, మహిమలు, లీలలు, వింతలు సృష్టించిన కరుణా సముద్రుడైన శ్రీ దత్తాత్రేయస్వామి వారు నాటినుండి నేటివరకు*
*ప్రతిరోజూ కాశీలో స్నానం చేసి, కొల్హాపూర్ నందు భిక్ష చేసి, తుంగభద్రలో నీరు సేవించి, మహుర్ ఘడ్* *నందు నిద్ర చేస్తున్నారు.*
*స్వామివారు నీరు సేవిస్తున్న పవిత్ర ప్రదేశమే పాంచలేశ్వర్.*
*అట్టి పాంచలేశ్వర్ విశిష్టమైన దత్త క్షేత్రముగా ప్రసిద్ధిచెందినది.*
*దత్తాత్రేయుని భోజన స్థలమే పాంచలేశ్వర్.*
*మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో నిగెల్ రాయి తాలూకాలో పాంచలేశ్వర్ గ్రామమున్నది.*
*అక్కడే గోదావరి నది ఉన్నది. ఆ నది మధ్యలో దత్తాత్రేయ ప్రభువు భోజనం చేసే గద్దె కలదు. (8 ×4 ×2 )*
*గద్దె పరిమాణం.*
*చుట్టూ భక్తులు కూర్చొని ధ్యానం జపము, చేసుకోవడానికి బండలు ఏర్పాటు చేశారు.*
*ఆ గద్దె పై భాగములో ఎనిమిది పిల్లర్స్ తో అష్టభుజ ఆకారములో రూఫ్ వేసిఉంటుంది.*
*అక్కడ దత్తాత్రేయ విగ్రహము ఏమీ ఉండదు.*
*గోదావరి నీటి ప్రవాహము పెరిగితే ఈ గద్దె మునిగిపోతుంది.*
*ప్రతిరోజూ అక్కడగల పూజారి పాంచలేశ్వర్ గ్రామానికి భిక్షకు వెళతాడు.*
*అక్కడ గ్రామస్తులు ఇచ్చిన రొట్టె, అన్నము,కూరలు, స్వీట్లు తీసుకొచ్చి 12 గంటల కల్లా నివేదన చేసి, అక్కడ కూడిన భక్తులకు భోజనం పెడతారు.*
*భక్తులు కొందరు ధ్యానం, మరి కొందరు గద్దె చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు.*
*ఈవిధంగా పాంచాలేశ్వర్ నందు నిత్య కార్యక్రమం జరుగుతుంది.*
*' కాశి స్నాన జప, ప్రతిదివాసి కోల్హాపూర్ భిక్షేసి, నిర్మల నది తుంగ జలప్రాసి, నిద్రా మాహుర్ దేశి. '*
*ప్రతిరోజూ దత్తాత్రేయ స్వామి వారణాసిలో స్నానం చేసి, కొల్హాపురి నందు భిక్ష చేసి, పాంచాలేశ్వర్ నందు మధ్యాన్న భోజనం చేసి మహూర్ ఘడ్ నందు నిద్రిస్తారు.*
*( సాయిదర్శన్ పూర్వపు సంచికల నుండి సేకరణ ).*
No comments:
Post a Comment