Tuesday, May 14, 2024

సాయిబాబా భక్తులైన దంపతులు రఘునాద్ టెండుల్కర్, సావిత్రీబాయి టెండుల్కర్.* *వారు బాంబాయి నగర పరిసరాలైన బాంద్రాలో నివసిస్తుండేవారు

 *షిర్డి సాయిబాబాకి ఎందరో భక్తులు.*


*బాబా ద్వారకామాయిలో అసీనులై ఉన్నప్పుడు, నిత్యం ఎందరో అయనను దర్శిస్తుండేవారు.*


*అది భక్తులకు బాబా యందు భక్తి. ఎవరి భక్తి వారిది. ఒకరు వేరొకరి భక్తిని శంకించరాదు. భక్తి విషయములో అంచనాలు వేయటం కుదరదు ఒకరి భక్తిని చూసి సంతసించ వలెను కానీ, ఆ భక్తుని భక్తిలో లోపాలు చూడరాదు.*


*సాయిబాబా భక్తులైన దంపతులు రఘునాద్ టెండుల్కర్, సావిత్రీబాయి టెండుల్కర్.*

*వారు బాంబాయి నగర పరిసరాలైన బాంద్రాలో నివసిస్తుండేవారు.*


*వారి ఇంట్లొ ఒక వకుళ ( పొగడపువ్వుల ) చెట్టు ఉండేది. ఆ చెట్టు రోజూ విపరీతంగా పుష్పాలు రాల్చేది.*


*సావిత్రీబాయి ప్రతీరోజూ ఉదయము, మధ్యాన్నం, సంధ్యాసమయాలలో ఆ పుష్పాలు ఏరి ఓపికగా వివిధ కొలతలతో మాలలు తయారు చేసి, వారింట్లోగల సాయినాధుని పటానికి ఆ మాలలు వేసి అలంకరించేది.*


*అమెతో పాటూ, ఆమె భర్త కూడా సాయిబాబా భక్తుడే. ఆమె బాబా పటానికి మాలలు వేసేటప్పుడల్లా విమర్శించేవాడు. అయినా సావిత్రీబాయి తన సేవ మానలేదు.*


*కొంతకాలమైన తరువాత ఆ భార్యాభర్తలు షిర్డి వెళ్ళి బాబాను ద్వారకామాయిలో దర్శించుకున్నారు.*


*బాబా సావిత్రీబాయిని చూడగానే అక్కడ భక్తులతో "ఈ అమ్మ ( సావిత్రీబాయి ) నన్ను వకుళ పుష్పాలతో రోజూ ముంచెత్తింది. ఆ పుష్పాల సువాసన మైకంలో సృహ కోల్పోయాను. ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నాను " అని పలికారు.*


*సావిత్రీబాయి భర్తకు అప్పుడు తన భార్య భక్తి ఎంతటిదో తెలిసింది.*


*బాబా తనకు, తన ఫొటొ కు తేడా లేదని మనకి సాయి సచ్చరిత్ర ద్వారా తెలిపారు.*


*కనుక బాబాకు ఎంత శ్రద్దతో పూజిస్తే అంత దగ్గరై మనలను అనుగ్రహిస్తాడు.*

No comments:

Post a Comment