Tuesday, May 14, 2024

1914 లో ప్రఖ్యాత గాయకుడు, ప్రముఖ సంగీత విద్వాంసులు, గాయకుడు అయిన అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ గాన కచ్చేరిని బూటీ ద్వారకామాయిలో ఏర్పాటు చేశాడు

https://youtu.be/6WBCToQku70

https://youtu.be/6WBCToQku70

 *1914 లో ప్రఖ్యాత గాయకుడు, ప్రముఖ సంగీత విద్వాంసులు, గాయకుడు అయిన అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ గాన కచ్చేరిని బూటీ ద్వారకామాయిలో ఏర్పాటు చేశాడు.*

 *అందరు మసీదు ముంగిట సమావేశం అయ్యాక, ఆ గాయకుని మరాఠీలో తుకారాం అభంగాన్ని,పాడమన్నారు బాబా.* 

*అతడు ఆయనకు నమస్కరించి తుకారాం రాసిన  " హేచి దాన్  దేగా దేవా " ( దేవా "ఒక మనవి వినుమా " ) అనే పాటను పీలూ రాగంలో ఎంత మాధుర్యంగా గానం చేశాడు.*

*సాయి మంత్ర ముగ్ధులై నట్లు కన్నులు మూసుకొని శ్రద్ధగా విని, " ఎంత చక్కగా పాడావు! ప్రసాదించకుండటం సాధ్యపడని దానినే కోరాడు తుకారం " అన్నారు.*

*ఈ కచ్చేరి చేసిన అబ్దుల్ కరీం ఖాన్ కు రూ.150/- సంభావన ఇచ్చారు.*

*ఆ రోజు ఈ కచ్చేరి వలన మధ్యాహ్న హారతి ఆలస్యంగా ప్రారంభించారు.*


*ఆ ఆభంగం విని ఆనందించగలరు*


*జై సాయినాథ్*

No comments:

Post a Comment