*డిసెంబరు 19 -1912 వ సంవత్సరం.*
*తాత్యాసాబ్ నూల్కరు తాను చేస్తున్న సబ్ జడ్జి పదవి, స్వచ్ఛందంగా విరమణ చేసి పండరీపురం నుండి షిరిడీకి వచ్చి సాయి సన్నిధి చేరాడు.*
*చివరగా తన శేష జీవితాన్ని సాయి సన్నిధిలో గడపి, సాయి చరణాలలో ఐక్యమవ్వాలని ఏకైక తలంపుతో.*
*షిరిడీ చేరిన కొన్ని రోజులలోనే నూల్కరు ఆరోగ్యం క్షీణించసాగింది.*
*సాయి తన అనుగ్రహ వీక్షణాలతో నూల్కరును ఆరోగ్యవంతునిగా చేయగలరు. కానీ అలా చేయలేదు.*
*నూల్కర్ కూడా తనకు ఆరోగ్యం ప్రసాదించి, సాయి సన్నిదిలో వుండేటట్లు చేయమని కోరకపోవడం విశేషము.*
*షిరిడీలో నూల్కరు ఆరోగ్యము నానాటికి క్షీణించసాగింది.*
*అతని ఆరోగ్యపరిస్థితి ఎంతగా మారిందంటే అతడు బాబా దర్శనానికి ద్వారకామాయికి గానీ చావడి కి గాని రాలేని పరిస్ధితి.*
*భక్తులందరూ బాబా నూల్కరుకు అరోగ్యం ప్రసాదించి మామూలు మనిషిగా చేస్తారని ఆశించారు.*
*కాని సాయిబాబా అలా చేయలేదు.*
*చివరగా నూల్కరు సాయి పాదోదకం సేవించి బాబా చరణాలలో లీనమయ్యాడు.*
*బాబా తనను ఆశ్రయించిన నూల్కరు అరోగ్యము ఎందుకు బాగు చేయలేదు ?*
*బాబా దృష్టిలో నూల్కరు ప్రస్తుత జీవితములో చెయ్య వలసిన కార్యక్రమము ఏమీ లేదు.*
*బాబా నూల్కర్ ఆయుస్సును పొడిగించటం వల్ల నూల్కర్ కుటుంబానికి ఏమీ ఒనగూడదు.*
*అందుకే బాబా నూల్కరును తనలో ఐక్యం చేసుకున్నాడు.*
*కొన్నాళ్ల తరువాత, నూల్కరు భార్యకు ఒక వైపు సాయిబాబా, వేరొక వైపు నూల్కరు ఉన్న బంగారు లాకెట్ తయారు చేయించి బాబా చేతులమీదుగా స్వీకరించాలని ఆమె కోరిక.*
*ఆమె కోరిక తగ్గట్టుగానే ఒక లాకెట్టును తయారుచేయించాడు ఆమె పుత్రుడు విశ్వనాధ్.*
*ఆ లాకెట్టును, నూల్కరు ఫొటోను, షిరిడీలో శ్యామాకు పార్సిల్ లో పంపాడు.*
*ఆ పార్సిలు 19 -12 -1912 గురువారము నాడు సాయిబాబా కు చేరింది.*
*బాబా ఆ పార్సిలు విప్పకముందే "ఈ లాకెట్టులో ఇద్దరు వ్యక్తులున్నారు " అని అన్నారు.*
*ఆ మాటలు విని అందరూ అశ్చర్యపోయారు. ఆ పార్సిలు విప్పి చూస్తే అందులో సాయిబాబా, నూల్కరు వున్నారు.*
*బాబా ఆ లాకెట్టును 15 నిమిషాలు తన చేతిలో పెట్టుకున్నారు.*
*లాకెట్టులో ఉన్న నూల్కర్ ఫొటోను అందరికీ చూపిస్తూ "ఇతఁడు (నూల్కర్ ) నన్ను తనతో తీసుకువెళ్లాడు " అని అన్నారు.*
*షిరిడీలో అతి కొద్ది కాలంలో సాయిబాబాను కొరికలతో వేధించక, బాబా మనసును ఆకట్టుకున్న నూల్కరు భక్తి, ప్రేమలు అగణితమైనవి.*
*సేకరణ -సాయి @366 గ్రంథం*
No comments:
Post a Comment