*" చూడగలిగితే అణువు అణువునా కనిపించును సాయి రూపం.*
*వినగలిగితే రోమరోమాన వినిపించును సాయి నామం."*
*మోవురూ పెంచల నరసింహం.*
------------------'----------------------
*సాయిభక్తుడైన దాసగణు మహరాజ్ హరికథలు చెప్పుతూ మహరాష్ట్రలో అన్ని గ్రామాలకు, పట్టణాలకు తిరిగేవాడు.*
*దాసగణు ఒకసారి పూనా నగరంలో వామనరావు పోద్దార్ అనే భక్తుని ఇంట్లో బస చేస్తుండగా, బయట వీథిలో ఎవరో కుర్రవాని ఏడుపు వినబడింది.*
*దాసగణు ఆ బాలుని వద్దకు వెళ్ళి కారణమడిగాడు.*
*అందుకు ఆ బాలుడు " తాను భిక్షావృత్తి చేసుకొంటూ వేదాలు నేర్చుకొంటున్నానని, ఆ రోజున ఎవరో తనను ముట్టుకొన్నారని, ఆ రోజు భిక్షచేసిన ఆహారము తినకూడదని, మరుసటి రోజు కూడా భిక్ష చేయకూడదని, అందువల్ల ఆకలికి తట్టుకోలేకపోతున్నాని " దాసగణు కు చెప్పాడు.*
*పూనా వంటి మహానగరంలో మధూక వృత్తి చేసుకొంటూ, శాస్త్రములు అధ్యయనం చేసుకొంటూ, నియమ నిష్టలు పాటించే ఆ బాలుడు దాసగణు మహరాజ్ ను ఆకర్షించాడు.*
*అనాధుడైన ఆ బాలునకు శాశ్వత పోషణ ఏర్పాటు చేయ సంకల్పించాడు. తాను హరికథలు చెబుతూ అనేక ప్రదేశాలు తిరగవలిసిన పరిస్థితి ఉండటంవల్ల, ఆ బాలుణ్ణి అహమద్ నగర్ లో ఉంటున్న నానాసాబ్ వద్ద ఉంచాడు.*
*ఒకసారి అహ్మద్ నగర్ నందుకల నానాసాబ్ ఆ అనాధబాలునితో కలసి షిర్డి వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకున్నారు.*
*సాయిబాబా నానాసాబ్ ను ఉద్దేశించి " నానా ! దాసగణు కుమారుడిని నీవద్ద ఎందుకు ఉంచుకొన్నావు ? " అని సాయి పలికారు.*
*సాయి అదేశం ప్రకారం నానాసాబ్ ఆ బాలుడిని దాసగణు వద్దకు పంపాడు.*
*మరోసారి దాసగణు బాబా వద్దకు పోగా, బాబా ఆతనితో, " అహ్మద్ నగర్ నందుగల, నానాసాబ్ వద్ద నీ కుమారుణ్ణి ఎందుకు ఉంచావు ? నీ కొడుకుని నీవే చూసుకో ! ఇది దైవ నిర్ణయం " అని బాబా పలికాడు.*
*అనాధుడైన ఆ బాలురు బాబా అదేశం ప్రకారం, దాసగణు మహరాజ్ కు కుమారుడైనాడు.*
No comments:
Post a Comment