Tuesday, May 14, 2024

సాయిబాబా హయాములో, షిరిడీలో, బాబాను ప్రతి విషయంలో సలహ అడగడం, ఆవిధంగా వ్యవహరించటం అనే అలవాటు ఆరోజులలో భక్తులకు ఉండేది

 *సాయిబాబా హయాములో, షిరిడీలో, బాబాను ప్రతి* *విషయంలో సలహ అడగడం, ఆవిధంగా వ్యవహరించటం అనే అలవాటు ఆరోజులలో భక్తులకు ఉండేది.*

*బాబా దేహత్యాగము చేసిన తరువాత , కాకాసాబ్ దీక్షిత్ లాంటి భక్తులు బాబా ఫోటో ముందు చీటీలు వేసి,ఆయన సలహ తీసుకొవడం  మొదలెట్టారు. తరువాత ధుమాల్, పురందరే , పూజ్యశ్రీ బి.వి.నరసింహస్వామి మున్నగువారు చీటిలు వేసి అడుగుతుండేవారు.* *వారందరకీ ఎంతో యోగ్యమైన, శ్రేయస్కరమైన సమాధానాలు లభిస్తుండేవి.*

*అయితే నేటి భక్తులకు బాబా ప్రత్యక్షంగా ఇచ్చేందుకు సిద్దంగా వుండగా, తమ కంటే శ్రేష్టులుగాభావించి, స్వామిజీలను, లివింగ్ గురువులనే చెప్పుకొనే వారిని,సద్గురువులని బిరుదు తగిలించుకొన్నవారి వద్దకి వెళ్లి, ప్రశ్నలు ఎందుకు అడుగుతారో అర్థం కావటంలేదు.*

*సాయి అంకిత భక్తుడైన* 

*శ్రీ నింబాల్కర్ ఈ క్రింది విదంగా చెప్పడం జరిగింది.*


*"నేను నా 23 సంవత్సారల అనుభవంతో గుండెమీద* *చేయివేసుకొని చెప్తాను,*

*నిజమైన శ్రద్దతో, ఏ భక్తుడైనా ప్రశ్న అడిగినపుడు సాయిబాబా నుండి యోగ్యమైన సమాధానం లభిస్తుంది.* 

*అయితే దానికోసం ఈ క్రిందిచెప్పబడ్డ నియమాలు పాటించవలిసివస్తుంది.* 


*ప్రశ్న అడిగేవారు సాయినాధుడు ఒక్కడే మనలను తరింపచేసేవాడు అన్న భావముతో శరణు వెళ్లవలిసిఉంటుంది.* 

*శ్రద్ద -సహనం పెట్టుకోవాలి.*


*2 చీటిలు వేసి ప్రశ్న అడిగిన తరువాత ఏ విధముగా సమాధానం వస్తే  ఆవిధంగానే వ్యవహరించాలి.* *వచ్చిన సమాధానం మనకి నచ్చే విధముగా లేకపోయినా, లేదా ఇతరులు ఏదో కారణం చెప్పి, వచ్చిన జవాబుకు* 

*విరుద్ధంగా వ్యవహరించ మని సలహా ఇచ్చినప్పటికీ, మన నిర్ణయం మారకుండా ఉండాలి.* *అలా మనం ఆచరించటానికి కుదరకపోతే, అసలు ప్రశ్న అడగకపోవడమే మంచిది.*


*3 ప్రశ్నకు వచ్చిన సమాధానం యోగ్యంగా ఉందా లేదా అన్న అనుభవం రావడానికి ఓర్పు వహించవలసి ఉంటుంది.* *మొదటిలో ఒకవేళ వ్యతిరేకంగా అనుభవం వచ్చినాకంగారుపడకుండా,* *బాబా చివరకి శ్రేయస్సు కలిగిస్తారు అన్న దృఢమైన నమ్మకం పెట్టుకోవలసి ఉంటుంది.*


*4 ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు జవాబు నచ్చలేదని మళ్ళీ అదే ప్రశ్న అడుగకూడదు. బాబా తన సమాధాన్ని మార్చుకోరు.*


*5 ప్రశ్నలు అదేపనిగా చిన్న చిన్న విషయాలు అడిగి బాధపెట్టకూడదు.* *ఎంతో కఠిన సమస్య అయితేనే బాబా వద్దకి పోవాలి. ఏ నంబరు టికెట్ తీసుకొంటే లాటరీ ఫలిస్తుంది ?* *ఏ గుర్రం రేసులో గెలుస్తుంది ?* *కూతురికి లేదా కోడలికి ఆడపిల్లపుడుతుందా, మగపిల్లవాడు పుడతాడా?*పరీక్షప్యాసవుతాడ, ఫెయిల్ అవుతాడా ? ఉద్యోగము వస్తుందా, రాదా అన్న ప్రశ్నలు అడుగకూడదు.*


*బాబా వీథిలో ప్రశ్నలు చెప్పే జ్యోతిష్కుడు కాదు.*


*ఏ కష్టమూ పడకుండా డబ్బు సంపాదించడానికి ఉత్తేజాన్ని, మార్గాన్ని బాబా ఇవ్వడు.* 

*స్వాతిక ప్రవృత్తిగల భక్తులను కష్టాల కొలిమినుండి రక్షించటానికి, భయంకర సమస్యలనుండి బయట పడవేయడానికి, సంసారంలో యోగ్యం అయిన నిర్ణయాలు తీసుకోవడానికి మార్గదర్శనం చేస్తారు.* 


*విశేషించి ఆధ్యాత్మికమైన ప్రశ్నలకు, పరమార్ధ మార్గంలో సమస్యలకు సమాధానాలు బాబా ఎంతో ఇష్టంగా ఇస్తారు.*


*6 ప్రశ్నఅడగటంకోసం, షిర్డికో, లేదా ఏ స్వామిజీ వద్దకో, సద్గురువులు, శ్రేష్ఠ భక్తులవద్దకో, వెళ్లనవసరం లేదు.* 


*ఏ సాయిభక్తుడైనా తన ఇంట్లోగల, బాబా ఫోటోముందుగాని, విగ్రహము ముందుగానీ, ఆయన చరణాలు వద్ద చీటిలు పెట్టి ఎవరైనా పిల్లవానిచే, దానిని* *తీయించి బాబా సలహాను, మార్గదర్శనం పొందవచ్చు.*

No comments:

Post a Comment