శ్రీ దత్త లీలా క్షేత్ర మహత్యం..🙏🏻
9::: విశ్వంభరావధూత
సంస్కృత o:శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి
తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.
అత్రినందన భగవాన్ శ్రీ దత్తాత్రేయ స్వామి భక్తుల సంక్షేమం కోసం విశ్వంభరావధూత అవతారం స్వీకరించారు. బదరికాశ్రమంలో తపస్సుతో సిద్ధి పరిపూర్ణం చేయడానికి తపస్సు చేస్తున్న యోగులను, భక్తజనులను అనుగ్రహించడానికి, అజ్ఞానమును నిర్మూలించటానికి జ్ఞానసాగర రూపంలో ప్రకటం అయి
అహంకారం పరిహారం చేశారు.
దత్తాత్రేయ స్వామి సిద్ధులందరూ నా సలహా పాటించడం ద్వారా వేగంగా ఆధ్యాత్మిక పురోగతి పొందుతున్నారా, లేదా అని దత్తత్రేయ స్వామి అనుకున్నారు. సద్గురువు కేవలం భోధతో అగకూడదు, తన భక్తులు భోధలు ఆచరించడానికి కావలసిన పరిస్థితిని కూడా కల్పిస్తారు.
దత్తాత్రేయ స్వామి సిద్ధ జనులను పరీక్షిoచడానికి ఒక విచిత్ర మారువేషంలో, వికృత రూపంలో కుక్క ముసుగులో లోపలికి ప్రవేశించి, వారి మధ్య ధ్యానమునకూ కూర్చున్నారు.
వారిలో కొందరు విచారంగా,కొందరు చపల చిత్తంతో, కొందరు కోపంతో,కొందరు ఆతృతతో, కొందరు వ్యర్ధ ప్రసoగంతో ఉంటే, కొందరు తీవ్ర ధ్యానంలో వున్నారు. దత్తాత్రేయ స్వామి వారిపై దయతో వారికి తన విశ్వరూపం తెలియజేసారు.
దత్తాత్రేయుడు చంచలమైన మనస్సు గల వారికి స్థిరమైన మార్గనిర్దేశం చేశాడు. ఈ అవతారాన్ని విశ్వంభవరావధూత అంటారు. ఈ అవతారం చైత్ర మాసంలో, పౌర్ణమి రోజున, చిత్ర రాశిపై రెండవ గడియారం యొక్క మొదటి క్షణంలో జరిగింది. మంగళవారం అయిన ఆ శుభ క్షణంలో శ్రీదతత్రేయ తొమ్మిదవ అవతారాన్ని స్వీకరించారు.
విశ్వరూప దర్శనంలో చాలా దశలవారిగా వేలాది మంది జననం, వేలాది మరణం కనిపించాయి. వేలాది ముఖాలు కూడా ఉన్నాయి. అనంతమైన అసంఖ్యాక తేజోమయ దివ్య జ్యోతిర్మయ నక్షత్రాలు వస్తున్నాయి,పోతున్నాయి. ఈ విశ్వంలో కనిపించడం ద్వారా, నేను విశ్వం యొక్క మూలం,విశ్వం యొక్క జననం మరియు లయ అని శ్రీదత్తాత్రేయుడు అందరి దృష్టికి తీసుకువచ్చాడు. ఆయన తన మాయకు తానే ఆశ్రయమని, తాను నిర్గుణుడు చెప్పి ,సిద్ధులకు, భక్తులకు అభయమిచ్చాడు. ఆ రోజు ఈ క్రింద శ్లోకం చదివి అర్ఘ్యం , గోదానము యిచ్చి పూజించాలి.
శ్లో:: విశ్వంభరాయ దేవాయ భక్త ప్రియ కరాయచ !
భక్త ప్రియాయ దేవాయ నామ ప్రియాయ తే నమః ॥
జై గురు దత్త

No comments:
Post a Comment