సాయినాథ అష్టోత్తర శతనామావళి .
" ఓం అసహాయ సహాయాయ నమః "
"ఎవరూ లేని దీనులకోసం సాయినాథుడు చాపును కరుణా హస్తం " అన్నది సాయి అభయం
" నీవే తప్ప నితంపరం ఎరుగ " అని బాబాను
శరణువేడిన మరు క్షణంలో ఆయన సహాయము
అందుతుంది .దాసగణు మహరాజ్ ,కానాభిల్ అను గజదొంగ చేతిలో చిక్కి " సాయీ రక్షించు "
అను చేసిన ఆర్తనాదమే అతణ్ణి కాపాడింది .
నిరుపేదగా జీవించిన మహాకవి బమ్మెర పోతనగారి ఇంటికి వెయ్యిమంది అతిథులు ఒక్క
సారి రాగా " నిస్సహాయుడను ! నీవే కాపాడు తల్లీ
అని శారదామాతను ప్రార్దించగా స్వయంగా రామలక్ష్మణులు వచ్చి కావలిసిన వంట సరుకులు
అందచేసి వెళ్లారు .నిండుకొలువున నిస్సహాయురాలిగా నిలబడిన ద్రౌపదిని కాపాడినది ఆ పరమాత్మే గదా ! నిస్సహాయులకు ఒక క్షణంలో సహయము దొరుకుట సాయిభక్తులకు అడుగడుగునా అనుభవాలే .
బాబాను చూడాలనీ ఎంతో దూరంనుండి వచ్చింది
ఒక వృద్ధురాలు .మశీదు ద్వారమువద్ద గల జన
సందోహం దాటి వెళ్ళలేక ,శక్తిలేక బయట నేలమీదే కూలబడిపోయింది .బాబా కోసం తెచ్చిన
రొట్టెలో సగంపైగా ఆకలికి తట్టుకోలేక తినివేసింది .
ఏదో బాధ స్వామిని చూడలేదని ఆర్తి .ఆ వృద్ధురాలి మనసుతో పిలిచిన పిలుపు బాబాకు
వినిపించిందెమో ! బాబా శ్యామాను పిలిచి " నాకోసం వచ్చి ఒక ముసలామె వచ్చి మశీదు గడపలో ఉన్నది .దారి లేక అల్లాడుతున్నది .వెళ్ళి
ఆ ముసలామెను తీసుకు రా ! .ఆమె తనవద్దకు
రాగానే పలకరించి "నాకోసం ఏమి తెచ్చావమ్మా ?
అని అడిగి ఆ మిగిలిన ఎండిపోయిన రొట్టెను
తిన్నారు ఎంతో ప్రేమగా .అది భక్తులయెడల సాయిబాబా చూపే ప్రేమ హస్తం .

No comments:
Post a Comment