Sunday, December 6, 2020

సాయిబాబా, పాండురంగ హారతులు

*సాయిబాబా, పాండురంగ హారతులు*

*ఈ రోజు శిరిడీ సమాధి మందిరంలో

 *కార్తిక ఏకాదశి ప్రత్యేక హారతి*


*సమాధి ముందు పండరి విఠలుని ఛాయాచిత్రం ఉంచుతారు*

*మన సాయినాథుల వారికి పూలమాలలతో పాటు తులసీ దళ మాలా, స్వర్ణ ( బంగారు ) దండతో అలంకరిస్తారు.*

ఈ అలంకారం కాకడ ఆరతి తరువాత నుండి శేజ్ ఆరతి ముందు వరకు ఉంటుంది.

*మన సాయికి కాకడ ఆరతి, తుకారాముని పాండురంగ అభంగంతో మొదలైన విధంగానే శేజ్ ఆరతిలో తుకారాముని పాండురంగ అభంగంతో ముగుస్తుంది.*

*సాయికి ఆరతులు ఎక్కువగా పాండురంగ పరంగానే ఉంటాయి.*

*దాసగణు మహారాజ్ ప్రముఖ అభంగము*

*శిరిడీ మాఝే పండరపుర -* *సాయిబాబా రమావర*
*బాబా రమావర - సాయిబాబా రమావర*

*శిరిడి గ్రామము నాకు* *పండరీపురము వంటిది*  *సాయి బాబాయే*
 *రమావరుడైన విఠలుడు.*

అని దాసగణు కీర్తిస్తారు.

*సాయియే విఠలుడు -*
*విఠలుడే సాయి*

*ఎందరికో బాబా విఠల   దర్శనమిచ్చారు కదా!*

*అక్కడి వాడే ఇక్కడ ఉన్నాడు*

*ఇక్కడి వాడే అక్కడ ఉన్నాడు*

*అక్కడ ఉండే పాండురంగడుఇక్కడ ఉన్నాడు*

*ఇక్కడ ఉన్న సాయినాథుడు అక్కడ ఉన్నాడు*

*పండరిపురంలో విఠలుని ఆరతి పాటను, శిరిడీలో మన సాయికి ధూప్ ఆరతిలో పాడుతారు*

ఈ రోజు *కార్తీక ఏకాదశి*
సందర్భంగా ఈ ప్రత్యేక ఆరతి పాటను ధూప్ ఆరతిలో

*" ఆరతి సాయిబాబా "* 
                   లో
*" ఇచ్ఛితా దీనచాతక నిర్మలతోయ నిజ సూఖ "*

        *తరువాత*

*శిరిడీ మాఝే పండరపుర*
*సాయిబాబా‌ రమావర*

            *ముందుగా*

             *పాడుతారు*

 *పాండురంగ విఠల్ ఆరతి పాట మన సాయి భక్తల కోసం*

*యుగె అఠావిశ విఠేవరి ఉభా*
*వామాంగి రఖుమాయి దిశ దివ్య శోభా*
*పుండలీక భేటి పరబ్రహ్మ ఆలే గా*
*చరిణి వాహే భీమా ఉద్థరి జగా*
       
*జయదేవ జయదేవ* 
*జయ పాండురంగ*
*హో హరి పాండురంగ*

*రుఖుమాయి వల్లభ రాయిచ్యా వల్లభ*
     *పావే జివలాగ*
  *జయదేవ జయదేవ*

*తులసీమాలా గాళ కర్ తేవుని ఘటి*
*కాస్సే పీతాంబర కస్తూరి లల్లాటి*
*దేవ్ సురవర్ నిత్య యేటి భేటి*
*గరుడ హనుమంత పుడే ఉచే రహతి*
 
*జయదేవ జయదేవ జయ పాండురంగ*
*హోం హరి పాండురంగ*
*రఖుమాయి వల్లభ రాయిచ్యా వల్లభ*
        *పావే జివలాగ*
      *జయదేవ జయదేవ*

*ధన్య వేణునాద అనుక్షేత్రపాల*
*సువర్ణాచి కమలే వనమాళ గళ*
*రాయి రఖుమాభాయి రాణియా సకల*
*ఓవాళితి రాజ విఠోబా సావళ* 
   
*జయదేవ జయదేవ జయ పాండురంగ*
*హో హరి పాండురంగ*
*రుఖుమాయి వల్లభ రాయిచ్యా వల్లభ*
       *పావే జివలాగ*
    *జయదేవ జయదేవ*

*ఓవాళు ఆరత్యా కురువంద్యా యేటి*

*చంద్రభాగ మాజి సోడునియా దేటి*

*దిండ్యా పతాక వైష్ణవ నాచ టి*
*పండరీచ మహిమ ద్వారతీత మహిమ వర్ణావా కీర్తి*

*జయదేవ జయదేవ జయ పాండురంగ*
*హో హరి పాండురంగ*
*రుఖుమాయి వల్లభ రాయిచ్యా వల్లభ*
           *పావే జివలాగ*
        *జయదేవ జయదేవ*

*ఆషాడ కార్తీకి భక్తజన యేతి*
*హో సాధుజన యేతి*
*చంద్రభాగే మాజి*
*స్నానే జే కరితి*
*దర్శన హే మాత్రే*
*తాయన్ హోయ ముక్తి*

*కేశవసి నామదేవ మాధవాసి నామదేవ*
*భావేన్ ఓవాళితి*
      *జయదేవ జయదేవ*
*జయదేవ జయదేవ జయ పాండురంగ*
*హో హరి పాండురంగ*
*రుఖుమాయి వల్లభ రాయిచ్యా వల్లభ*
       *పావే జివలాగ*
    *జయదేవ జయదేవ*

*పాండురంగ హారతికి తెలుగు అర్థం, భావము.* 

*మొదటి చరణం - భక్త జనోద్ధరణ కొరకు ఆ విఠలుడు ఆ ఇటుకరాయి మీద ఎన్నో ఏళ్ళనుండి నిలబడి ఉన్నాడు* 

*జగన్మాత రుక్మిణి విఠలుని* *ఎడమ వైపు నిలబడి ఉన్న దృశ్యం ఎంత మనోహరం.*

 *సాక్షాత్తు ఆ* *పరబ్రహ్మస్వరూపుడు* 
*తన భక్తుడైన పుండలీకుని* *అనుగ్రహించుటకొరకు* 
*ఈ భువిపై దిగివచ్చెను* 

*పవిత్ర చంద్రభాగా (భీమా )నది ఆ పరమాత్ముని చరణాలయందు ప్రవహిస్తూ ఈ లోకాన్ని పావనం చేస్తున్నది*

*జయదేవ జయదేవ జయపాండురంగా రుక్మిణీ వల్లభా!* *మాతా రాధా*
*(రాయిచా ) వల్లభా* 
*నీకు ప్రియమైన భక్తులను ఆశీర్వదించు.* 
*జయదేవ జయదేవ* 

2. *ఆ స్వామి విఠలుడు తన కంఠమున, తనకు ప్రియమైన తులసీమాలను ధరించి  శోభించుచున్నాడు.*
*ఆ ప్రభువు తన రెండు హస్తములను తన  నడుమునకు చేర్చి ఉన్నాడు.*
*మంగళకరమైన ఆయన శిరస్సు నుదురుభాగం  కస్తూరి తిలకముతో ప్రకాశించుచున్నది*

3.  *పచ్చని పకృతి వనములనుండి మధురమైన* 
*వేణుగాన ధ్వనులు వినబడుచున్నవి.* *బంగారు పద్మములు మరియు అనేకరకములైన వన పుష్ప హారములతో ఆయన మెడభాగం ఎంతో శోభాయమానంగా నిండుగా కనిపిస్తున్నది*
*ఆ స్వామి తమ సన్నిధికి* *చేరగానే ప్రియ సఖులైన* *రాధా, రుక్మిణి మాతలు ఆ* *విఠలునికి హరతులు* 
*సమర్పిస్తున్నారు* 
*జయదేవ జయదేవ* 

4.  *ఆరతి అర్చనలు* *ముగిసిన పిదప ఆ హారతి మట్టి ప్రమిదలు చంద్రభాగ* *నదిలో వేసిన పిదప అవి* 
*అర్ద చంద్రాకార ఆకృతిలో* *తెలియాడిన ఆ దృశ్యం* 
*కనువిందు చేస్తుంది* 
*పరమ ఆనందంతో విష్ణు* *భక్తులు చేత ధ్వజములు,*
*రంగు రంగు వస్త్రాల* 
*అలంకరణలు చేతపట్టుకొని* *భక్తి* *పారవశ్యంతో నృత్యం చేయుచున్నారు.* *అటువంటి నయానందకరమైన మనోహర దృశ్యములను* 
*ఎలా యేమని వర్ణించగలను?*
*జయదేవ జయదేవ జయ పాండురంగా*

*సేకరణ, ఆంధ్రీకరణ, భావార్థం:*

*అప్పారావు*
రాజమహేంద్రవరం

*చిల్లర కృష్ణమూర్తి*
చెన్నై

No comments:

Post a Comment