శ్రీ షిర్డీ సాయిబాబా ధ్యానం గూర్చి పూజ్యశ్రీ కీ .శే .
మాతాజీ సాయిలీలమ్మ గారు చెప్పిన విషయాలు
అమ్మ తన ఎదుట బాబా ఫొటో గానీ ,విగ్రహము
గానీ లేకుండానే మానసికంగా ధ్యానించేవారు .
ధ్యానానికి కూర్చుని నిర్మలంగా ,నిశ్చలంగా ,
పవిత్రమైన మనసుతో ముందు బాబాను సంకల్పించు కోవాలి .రెండు కనుబొమల మద్య
దృష్టిని కేంద్రీకరించగానే బాబా పవిత్ర ఆకారం
మనకు కనబడుతుంది .తరువాత బాబాను రత్నాలు ,వజ్రాలు ,విలువైన ఎన్నొ మణులు
పొదిగిన బంగారు సింహాసనము మీద ఆసీనులైనట్లు భావించాలి .బంగారు గంగాళంలో
నుండి బంగారు చెంబుతో పన్నీటిని తీసి స్నానం
చేయించాలి .బంగారు పిడిగల గంధపు కర్రతో
గంధాన్ని తీయాలి .శుభ్రమైన మంచి తువాలు
తీసుకుని శరీరమంతా చక్కగా నెమ్మదిగా తుడవాలి .తరువాత గంథం పూయాలి .
బంగారు పన్ను కలిగిన రోకలితో కుంకుమ దంచి
నొసట బొట్టు పెట్టాలి .పన్నీరు సెంటులాంటి
సుగంధ పరిమళాలు వెద జల్లాలి .సాంబ్రాణి
ధూపం వేయాలి .నిష్ఠ -సబూరి అనే రెండు రూపాయలు తాంబూలంలో పెట్టి సమర్పించి
ఎంతో భక్తి శ్రద్దలతో మానసిక పూల మాల వేసి
" ఓం సాయి " నామంతో పాదపూజ చెయ్యాలి .
తరువాత హారతి ఇవ్వాలి .ఇదే మానసిక పూజ .
ఆత్మ పూజ .అమ్మ నిత్యం చేసే ధ్యానము .ఆమె
నిరంతర సాధన .అదే ఆమె విశేష తపోబలం .
మాతాజీ సాయిలీలమ్మ గారిచే నిర్మింపబడిన
సాయిబాబా మందిరం దర్శించవచ్చు .ప్లాట్ నం .
52 .మంజీరానగర్ దగ్గర .ఫాదర్ బాలయ్యనగర్ .
ఓల్డ్ ఆల్వాల్ .సికింద్రాబాద్ .500010 .

No comments:
Post a Comment