దత్త లీలా క్షేత్ర మహత్యం ...🙏🏻
దత్తాత్రేయ షోడశ అవతారాలు...
7::: సిద్ధరాజు 🙏🏻
శ్రీ లీలావిశ్వంభర అవతారంలో ప్రజల మనస్సులో ధ్యాన మూర్తిగా నిలిచిపోయారు. తరువాత భూమి మీద అంతా తిరుగుతూ బదరికావన్ (హిమాచల్ ప్రదేశ్)లోనికి ఒంటరిగా ప్రవేశించారు. అక్కడ కఠోర తపస్సులో ఉన్న సిద్ధులు చాలా మంది ఉన్నారు. బాలా స్వరూపంలో చిన్మయానందంలో వున్న దత్తాత్రేయుని చూసి ఆశ్చర్య పోయి ఇంత ఆనంద స్థితిలో ఎలా ఉన్నారు? అని అడిగారు. ఆ పరమాత్మయే తమపై కరుణతో ప్రత్యక్ష మయ్యారని ఆనందించారు. దత్తుడే సర్వ సిద్ధులకు మూలం అని తెలుసుకొని తమను అనుగ్రహించమన్నారు. స్వామికి భక్తులుగా మారారు. వారి పట్ల ప్రసన్నులు అయిన దత్తుడు నేనే సర్వ సిద్ధులకు అధిపతిని. మీ అధిష్టాన దేవతలకి మీ అందరి ఆశ్రయ స్థానంని అని అన్నారు. అప్పుడు సిద్ధులు పరమేశ్వరా!మా పట్ల ప్రసన్నులై,మాకు అన్ని సిద్ధులు ప్రసాదించండి. దయాళువు అయిన తండ్రివి అయిన మీ పుత్రులమైన మాకు కళ్యాణం కలిగించండి. యోగ మార్గ సిద్ధులు ఉపదేశించి మాకు అంత:కరణo లో అఖండ భక్తిని ప్రసాదించండి. అని వేడుకున్నారు. వారిలో అహంకారం పూర్తిగా నశించిపోయింది.
దత్తాత్రేయ స్వామి వారికి అతి రహస్య కవచ,యోగాన్ని, చిత్త యోగ సాధన ను,అంగన్యాస,కర్మనిష్ఠ, తాంత్రిక పద్ధతులను ఉపదేశించారు. సిద్ధరాజు ఈ పద్ధతిని సిద్ధరాజ గమ"అని తెలిపారు. ఈ సిద్ధరాజ గమని తన అనన్య భక్తుడు అయిన శ్రీ దాసోపంత్ (ఆంబోజ్గాయి)కి ఉపదేశించారు.
బదరికాశ్ర మంలో సర్వ సిద్ధమండలి లోని అందరూ సిద్ధరాజ గమ"పద్ధతి అనుసరించి అనుష్ఠానం చేసి,జ్ఞాన సిద్ధులు అయ్యారు. సిద్ధరాజు కృపతో వారి సర్వ మనోభీష్ట ములు పూర్తి అయి కృతజ్ఞులు అయి ధన్యులు అయ్యారు.
సిద్దరాజు భగవాన్ శ్రీ దత్తత్రేయ సిద్ధ మండలికి సిద్ధరాజ గమ"ని ఉపదేశించిన రోజునే సిద్ధరాజు జయంతిగా చేస్తారు.
మాఘ పూర్ణిమ, మఖా నక్షత్రం, గురువారం, శుభ ముహూర్తంన ఈ సిద్ధరాజ గమ భోధించబడినది. ఈ రోజు క్రింది మంత్రం చదివి పూజ చేయాలి.
శ్లో॥ సర్వ సిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే ॥
సిద్ధ రాజాయ సిద్ధాయ మంత్ర దాత్రే నమో నమః॥
జై గురు దత్త

No comments:
Post a Comment