Sunday, December 6, 2020

షిరిడీకి చేరిన సాయిబాబాను పిచ్చి ఫకీర్ అన్నారు ప్రజలు


 షిరిడీకి చేరిన సాయిబాబాను పిచ్చి ఫకీర్ అన్నారు ప్రజలు .సాయబాబా యందు అజ్ఞానాన్ని 

నశింపచేసి ,జ్ఞానాన్ని బోధించగల సమర్ధత ,

మచ్చలేని జీవితం ,పవిత్రత  ,కోరికలు లేని పరమ శాంతి ,సాధన పరత్వం ,హిత ,మిత ,సత్య 

భాషిత్వం  ,కామక్రోధాదులు లేక ,జ్ఞాన వైరాగ్యాలతో ఉండటం ,.......ఇలా ఎన్నొ సుగుణాలు అయనను దైవాన్ని చేసాయి .

గురువు ,సద్గురువు  ,సమర్ధసద్గురువుగా 

కీర్తించబడ్డాడు .శ్రీ కృష్ణ జాగేశ్వర భీష్మ ,

"సమర్ధగురు సాయినాథ పురవీ మనోవాసనా "

(సమర్ధుడైన సద్గురు సాయినాథ భగవానుడు 

మన మనోవాంఛను నెరవేర్చును ) అని కాకడ 

హరతిలో, ప్రభాత అష్టకంలో సమర్థ సద్గురువుగా 

సాయిబాబాను స్తోత్రం చేశాడు ." నమామీశ్వరం 

సద్గురు సాయినాథం ( సద్గురురూపంలో నున్న 

ఈశ్వరుఁడు (పరబ్రహ్మ ) అయిన సాయినాధునికి 

నమస్కరించెదను )అని మధ్యాన హరతి  ,ధూప్ 

హరతిలో ,సాయినాథ మహిమా స్తొత్రంలో ,

ఉపాసనీ మహరాజ్ ,సాయిబాబాను సద్గురువుగా 

కీర్తించాడు  .అంతేగాక దాదాకేల్కర్ ,సాయి శరణానంద ,హేమాడ్ పంత్ ,హరి సీతారామ్ ధీక్షిత్ ,లక్ష్మణ్ కృష్ణాజీ నూల్కరు ,బాపూసాబ్ జోగ్ 

బాలకృష్ణ విశ్వనాద్ దేవ్ మున్నగు భక్తులు 

సాయిబాబాను సమర్థ సద్గురువుగా కీర్తించారు

No comments:

Post a Comment