సాయబాబా ఉపాసనీ మహరాజ్ ను షిర్డిలోని
ఖండోబా దేవాలయములో ఉండమని అదేశించారు
.ఇంకా బాబా అతనితో " నేను నీ
బసకు ( ఖండోబా దేవాలయం ) వస్తాను .నేనొస్తే ,
నన్ను గుర్తుపెట్టుకొని నాకు చిలుము ఇస్తావా ?"
అని అడిగాడు ఉపాసనా మహరాజ్ ను .అది విన్న ఉపాసనీ తికమకలో పడ్డాడు .సాయబాబా
ఖండోబా మందిరమునకు రావడము ఏమిటి ?
సాయబాబా వస్తే గుర్తుంచుకుపోవడం ఎలా
జరుగుతుంది ? ఎవరి ఇంటికి వెళ్లని బాబా తన
బసకు వస్తానని చెప్పడం ఏమిటి ? ఇలా ఎన్నొ
అలోచనలు ? సాయబాబా పలుకులు అలాగనీ
ఉంటాయి .ఒకొకసారి ఎవ్వరికీ అర్థం కాకుంటాయి
ఆలా అర్థం చేసుకొనేవారు నూటికొకరు ఉంటరు .
అప్పటికీ ఇప్పటికీ కూడా .ఖండోబా మందిరంలో
బాబా ఆనతి ప్రకారం నివశిస్తున్నాడు ఉపాసనీ .
ఒకసారి ఉపాసనీకు ద్వారకామాయి వెళ్లి బాబాకు
నివేదన చేద్దామని అనిపించింది .వెంటనే నైవేద్యము సిద్దం చేశాడు .నైవేద్యము తీసుకుని
బాబా వద్దకి బయలుదేరాడు .దారిలో అతనికి
ఒక కుక్క కనిపించింది .ఆ కుక్క ఆయన చేతిలోని
ఆహారాన్ని ఆశగా చూసింది .ఉపాసనీ అదేమీ
పట్టించుకోకుండా బాబా వద్దకి వెళ్లి నివేదన
సమర్పించాడు .బాబా అతనితో "ఇంత ఎండలో
బడి ,ఇక్కడకి వచ్చావెందుకు ? నేను నీకు దారిలో
కూర్చోని ఉంటినే ? " మీరు ఎక్కడ కూర్చుని ఉన్నారు బాబా ? " అని ఆశ్చర్యంగా అడిగాడు
ఉపాసనీ . నీవు వంటచేస్తున్నంతసేపు అక్కడే కూర్చుని
చూస్తున్నాను కదా ! " అని అన్నాడు బాబా .
" నేను వంటచేస్తున్నప్పుడు అక్కడ ఒక నల్ల కుక్క
తప్ప మరెవరూ లేరు " అని ఉపాసనీ అన్నాడు .
" అవును ! ఆ నల్ల కుక్కను నేనే ." అని పలికాడు
బాబా .ఆ మాటవిని ఉపసనీ అవాక్కయ్యాడు .

No comments:
Post a Comment