Sunday, December 6, 2020

శ్రీపాదులు భక్తులకు తెలిపిన ద్వాదశ అభయ వాక్యములు

🌹దిగంబరా దిగంబరా శ్రిపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా🌺



🌻🌷శ్రీపాదులు భక్తులకు తెలిపిన ద్వాదశ అభయ వాక్యములు🌻🌹


🌼🌷శ్రీపాదులవారు దత్తదాసుని యింట పలికిన వచనములను శ్రద్ధగా ఆలకింపుము.🌷🌸


🌸1 . నా చరిత్ర పారాయణము చేయబడు ప్రతి చోట నేను సూక్ష్మ రూపమున ఉందును.


🌹2 . మనోవాక్కాయకర్మలచే నాకు అంకితమైన వానిని నేను కంటికి రెప్పవలె కాపాడుచుందును.


🌻3 . శ్రీ పీఠికాపురమున నేను ప్రతి నిత్యము మధ్యాహ్న సమయమున భిక్ష స్వీకరించెదను. నా రాక దైవరహస్యము.


🌼4 . సదా నన్ను ధ్యానించువారి కర్మలను, అవి ఎన్ని జన్మ జన్మాంతరముల నుండి ఉన్నవి అయిననూ వానినన్నింటినీ భస్మీపటలము గావించెదను.


🌺5 . అన్నమో రామచంద్రా అని అలమటించు వారికి అన్నము పెట్టినచో నేను ప్రసన్నుడనయ్యెదను.


🌸6 . నేను శ్రీపాద శ్రీవల్లభుడను! నా భక్తుల యింట మహాలక్ష్మి తన సంపూర్ణ కళలతో ప్రకాశించును.


🍎7 . నీవు శుద్ధాంతఃకరణుడవేని నా కటాక్షము సదా నీ యందు ఉండును.


💐8 . నీవు ఏ దేవతాస్వరూపమును ఆరాధించిననూ, ఏ సద్గురువును ఆలంబనముగా చేసికొన్ననూ నాకు సమ్మతమే!


🌹9 . నీవు చేయు ప్రార్థనలన్నియునూ నాకే చేరును. నీవు ఆరాధించు దేవతాస్వరూపము ద్వారాను, నీ సద్గురువు ద్వారాను నా అనుగ్రహమును నీకు అందచేయబడును.


🌷10 . శ్రీపాద శ్రీవల్లభుడనిన పరిమితమయిన యీ నామరూపము మాత్రమే కాదు. సకల దేవతా స్వరూపములను, సమస్త శక్తులను అంశలుగా కలిగిన నా విరాట్ స్వరూపమును అనుష్ఠానము ద్వారా మాత్రమే నీవు తెలుసుకొనగలవు.


🌸11 . నాది యోగసంపూర్ణ అవతారము. మహాయోగులు, మహాసిద్ధ పురుషులు సదా నన్ను ధ్యానించెదరు. వారందరునూ నాయొక్క అంశలే.


🌼12 . నీవు నన్ను ఆలంబనముగా చేసుకున్న యెడల నేను నీకు ధర్మమార్గమును, కర్మ మార్గమును బోధించెదను. నీవు పతితుడవు కాకుండా సదా నేను కాపాడెదను.


🌹🌻శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.🌹🌻

[7:03 AM, 8/30/2020] +91 88857 87750: బ్రహ్మశ్రీ మల్లాది చన్ద్రశేఖర శాస్త్రి గారి అద్భుతమైన ప్రవచనం దత్తాత్రేయ స్వామి వారి మీద....రోజుకు ఒక భాగం పెడుతున్నాము.

No comments:

Post a Comment