Sunday, December 6, 2020

సాయిబాబాకు సమకాలికులైన యోగులతో సత్సంబంధాలు ఉండేవి .కొందరు సాయిబాబాను స్వయంగా వచ్చి దర్శించారు .మరికొందరు తమ తమ నమస్కారాలను సాయిబాబాకి పంపేవారు

సాయిబాబాకు సమకాలికులైన యోగులతో 

సత్సంబంధాలు ఉండేవి .కొందరు సాయిబాబాను 

స్వయంగా వచ్చి దర్శించారు .మరికొందరు తమ 

తమ నమస్కారాలను సాయిబాబాకి పంపేవారు .


సాయబాబా సమకాలీకులలో గజానన మహరాజ్ 

ఒకరు .ఆయన శేగాంలో స్థిరపడ్డారు .బాబా షిరిడీలో స్థిరపడ్డాడు .ఇద్దరి తల్లితండ్రులెవరో 

తెలియదు .ఆ ఇద్దరి జన్మసమయం ఏదో తెలియదు .మహరాష్ట్ర విధర్భ ప్రాంతంలో 

గజానన మహరాజ్ చిత్రం లేని గృహమే ఉండదు .

సాయబాబా వలె అంతటా ఖ్యాతి ఉన్నది .

గజానన మహరాజ్ 8 -9 -1910 అంటే ఋషిపంచమి రోజున దేహాన్నీ విడిచిపెట్టారు .

తాము దేహాన్నీ విడిచిపోతున్నామని షిర్డీలోని 

సాయినాధునివలె ముందే తెలిపిన మహానీయులు .ఈ దినం ఋషి పంచమి .

మంగళవారం .ఈనాడే గజానన మహరాజ్ 

సమాధిచెందిన దినం .

సాయబాబా 1910 రుషిపంచమినాడు ద్వారకామాయిలో విచారగ్రస్తుడై ఉన్నాడు .

" హా ! గజాననా పోయితివా "ఆంటూ చాలా సమయము విచారగ్రస్తుడై ఉన్నాడని కపర్డే కుమారుడు తెలిపాడు .అక్కల్కోట మహరాజ్ ,

సాయబాబా ,గజానన మహరాజ్, ఈ ముగ్గురిని 

త్రీమూర్తి స్వరూపాలుగా భావిస్తారు .గజానన మహరాజ్ ఖాపర్డేను షిర్డీలోని సాయినాథుని 

ఆశ్రయింపుమని కోరారు తన మహాసమాధి 

అనంతరం .ఇంకా నాసిక్ కు చెందిన ధుమాల్ ,

నాగపూరు కు చెందిన బుట్టి కూడా గతంలో 

గజానన మహరాజ్ భక్తులే .గజానన మహరాజ్ 

సాయబాబా వలె తన మహాసమాధి అనంతరం 

భక్తులకు సహాయము చేస్తానని మాటిచ్చారు .

గజాపతికోరా డే ,ప్రతిదినం గజానన మహరాజ్ 

సమాధిని సేవించే భక్తుడు .

 షిర్డి సాయబాబా 1918 విజయదశమినాడు 

మహాసమాధి చెందారు .గజాపతి కోరా డే కు 

ఒకసారి విజయదశమినాడు గజానన మహరాజ్ 

సమాధికి పంచామృత అభిషేకము చేయాలని కొరిక కలిగింది .ఇంకా ఆనాడే అన్నదానం చేయాలని కోరికగూడా కలిగింది .ఆ విషయాన్ని 

తన భార్యకు చెప్పాడు .ఆమె అంగీకరించలేదు .

బహుశా గజానన మహరాజ్ మహాసమాధి చెందినది రుషిపంచమినాడని ,విజయదశమి 

కాదనీ పంచామృత అభిషేకము ,అన్నదానము 

ఆనాడు చేస్తే బాగుంటుందని ఆమె అలోచన .

ఆ రోజు రాత్రి కోరా డే భార్యకు స్వప్నదర్శనమిచ్చారు గజాననులు .ఆమెకు 

తన భర్త చెప్పినవిధంగా విజయదశమినాడే 

అభిషేకము ,అన్నదానం జరపాలని అదేశించారు 

బహుశా తన సమాధికి ,బాబాసమాధికి భేదం లేదనీ ఇరువురూ ఒక్కటే అని తెలిపినట్లయ్యింది .

ఈ నాడు అనగా 3 -9 -2019 ఋషిపంచమి నాడు గజాననా మహరాజ్ గారిని స్మరించెదము 

గాక !

No comments:

Post a Comment